గీసుగొండ, అక్టోబర్ 12 : దోఖ పార్టీ కాంగ్రెస్ను స్థానిక సంస్థల ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని మాజీ జెడ్పిటిసి పోలీస్ ధర్మారావు, బీఆర్ఎస్ మండల పార్టీ కార్యదర్శి చల్లా వేణుగోపాల్ రెడ్డి లు అన్నారు. వరంగల్ జిల్లా గీసుగొండ మండలం విశ్వనాధపురం గ్రామంలో ఆదివారం కాంగ్రెస్ బాకీ కార్డులను బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ పంచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ దోఖా పార్టీ అని తెలంగాణ ప్రజలకు తెలుసు అన్నారు. కాంగ్రెస్ పార్టీ మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి 22 నెలలు అవుతున్నా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించారని మండిపడ్డారు.
స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టే ధైర్యం లేని కాంగ్రెస్ పార్టీ బీసీ బిల్లుతో నాటకాలు ఆడుతుందని అన్నారు. రైతాంగానికి యూరియా కూడా ఇవ్వలేని ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు అంకతీ నాగేశ్వరరావు, పుండ్రు జైపాల్ రెడ్డి, నాయకులు రవీందర్ రెడ్డి, గురం రఘు, శ్రీనివాస్, జవహర్ లాల్, కృష్ణ, రాజయ్య, రమేష్, తిరుపతి,సాంబయ్య, భద్రు యూత్ నాయకులు పార్టీ శ్రేణులు, పాల్గొన్నారు.