పరకాల : తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ చేపట్టిన నిరసన కార్యక్రమంలో భాగంగా చలో సెక్రటేరి యట్కు తరలి వెళ్తున్న అంగన్వాడీ టీచర్లను పోలీసులు ఎక్కడికి అక్కడ అడ్డుకుంటున్నారు. హైదరాబా ద్కు తరలి వెళ్లేందుకు పరకాల బస్టాండ్లో పోలీసులు హనుమకొండ- హైదరాబాద్ వెళ్లే బస్సుల్లో మహిళల ఆధార్ కార్డుల్లో వారి వివరాలను సేకరిస్తున్నారు. అనుమానం ఉన్న మహిళలను అడ్డుకుంటున్నారు.
ఈ క్రమంలో పరకాల బస్టాండ్ లో పోలీసులు కొంతమంది మహిళలను బస్సుల్లో నుంచి దించి పోలీస్ స్టేషన్కు తరలించే ప్రయత్నం చేయడంతో సదరు అంగర్వాడీ టీచర్లు తామెందుకు పోలీస్ స్టేషన్ కు రావాలని, మేము రామని ప్రతిఘటించారు. దీంతో సదరు పోలీసు సిబ్బంది మీరు హైదరాబాద్ వెళ్లొద్దని వెళ్తే కేసులు పెట్టాల్సి వస్తుందంటూ భయభ్రాంతులకు గురి చేశారు.