హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 5: హనుమకొండ పింగళి ప్రభుత్వ మహిళా కాలేజీ డిపార్టుమెంట్ అఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ ఆధ్వర్యంలో జనవరి 8, 9 తేదీల్లో జరిగే రెండు రోజుల జాతీయ సదస్సుకు సంబంధించిన పోస్టర్లు కేయూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కర్నాటి ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వల్లూరి రామచంద్రంతో కలిసి ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ డిపార్టుమెంటు అఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ విభాగాధిపతి డాక్టర్ బి.రాధికరాణితో పాటు కాలేజీ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్, సెమినార్ కన్వీనర్ బి.యుగంధర్, కామర్స్ విభాగ అసోసియేట్ ప్రొఫెసర్ సారంగపాణి, జి.రాజు, పి.రాజిరెడ్డి, జే.లకన్‌సింగ్ ఉన్నారు.