నర్సింహులపేట, జూన్ 10 : నర్సింహులపేట మండల ఫొటో, వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని మానుకోట జిల్లా ఫొటో, వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు తోట సుభాష్ ఆధ్వర్యంలో మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా కొమ్ము మధు, ప్రధాన కార్యదర్శిగా పంజా సుమన్, కోశాధికారిగా చిర్ర శ్యామ్ కుమార్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తోట సుభాష్ నియామక పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘం అభివృద్ధికి నూతనంగా ఎన్నికైన కార్యవర్గం పరస్పరం సహకరించుకొని ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఉన్నతికై పాటుపడాలని కోరారు. అనంతరం నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు మాజీ అధ్యక్షుడు పాము వెంకటేష్ ను మాజీ కార్యవర్గం ను శాలువా కప్పి సన్మానించారు.
ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ జిల్లా కోశాధికారి కడుదుల రవీందర్, జిల్లా వర్కింగ్ ప్రెసిండెంట్ షేక్ పకృద్దిన్, జిల్లా కుటుంబ భరోసా ఇంచార్జి సింగంశెట్టి బాబురావు, జిల్లా సహాయ కార్యదర్శులు మోడెమ్ సోమేశ్, కడారి వెంకటరమణ, జిల్లా ఉపాధ్యక్షులు ఏరుకొండ సాయి, దంతాలపల్లి మండల కోశాధికారి ఎండీ ఇమామ్, సీనియర్ ఫొటోగ్రాఫర్స్ చామకూరి రాంబాబు, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.