హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 18: నూతనంగా ఎన్నికైన ఉమ్మడి వరంగల్ జిల్లా ఫొటో, వీడియో జర్నలిస్టుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు సంపెట సుధాకర్, ప్రధాన కార్యదర్శి బొల్ల అమర్, కోశాధికారి గొట్టె వెంకన్నలను గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజు, ప్రధాన కార్యదర్శి బొల్లారం సదయ్య, కోశాధికారి బోల్ల అమర్ ప్రెస్ క్లబ్ హాల్ లో సన్మానించారు.
ఈ సందర్భంగా అధ్యక్షుడు వేముల నాగరాజు మాట్లాడుతూ కాలంతో పోటీపడుతూ విధులు నిర్వహించే ఫొటో, వీడియో జర్నలిస్టుల సేవలు వెలకట్టలేనివని అన్నారు. త్వరలో గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ సభ్యులకు అందించనున్న ప్రైవేటు ఇంటిస్థలాల కేటాయింపులో ఫొటో, వీడియో జర్నలిస్టులకు ప్రధాన్యమిస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షుడు బొడిగె శ్రీను, ఈసీ మెంబర్ ఎండీ నయీం పాషా, సీనియర్ జర్నలిస్ట్ వల్లాల బుచ్చిరెడ్డి, తోట తిరుమల్, ఉస్మాన్ పాషా పాల్గొన్నారు.