హైదరాబాద్ : కాంగ్రెస్ పాలనలో విసిగిపోయిన ప్రజలు వినూత్న పద్ధతుల్లో తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన హామలను అమలు చేయడంలో విఫలమైన ప్రభుత్వం కనీస సౌకర్యాలు కల్పించడంలో కూడా శ్రద్ధ చూపడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా జనగామ జిల్లాలోని చీటకోడూరు, గానుగుపహాడ్ గ్రామాల ప్రజలు వంతెనలు నిర్మించాలని డిమాండ్ చేస్తూ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫొటోలు గాడదకు కట్టి జనగామ పట్టణంలో ఊరేగించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. వంతెనలు రెండు సంవత్సరాల కింద కూలిపోయినా ఇప్పటివరకు ప్రభుత్వంచుకోవడం లేదని మండిపడ్డారు. నిరసన కారులను పోలీసులు అడ్డుకున్నారు.
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫోటోలు గాడిదకు కట్టి ఊరేగింపు
జనగామ జిల్లా చీటకోడూరు, గానుగుపహాడ్ గ్రామాల వంతెనలు 2 సంవత్సరాల కింద కూలిపోయినా ఇప్పటివరకు పట్టించుకొని ప్రభుత్వం
వంతెనలను వెంటనే నిర్మించాలని డిమాండ్ చేస్తూ గాడిదకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫోటోలు అంటించి జనగామ… pic.twitter.com/JnBYCTYr97
— Telugu Scribe (@TeluguScribe) November 3, 2025