ఘనంగా తొలి ఏకాదశి వేడుకలు
మండలంలో తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రజలు ఆలయాల్లో పూజలు చేశారు. ఊరుగొండలోని లక్ష్మీనర్సింహస్వామి ఆలయం, శివనాగేంద్రస్వామి ఆలయం, కోగిల్వాయిలో చెన్నకేశవస్వామి ఆలయంలో సర్పంచ్ సత్యనారాయణరెడ్డి, గట్ల విష్ణువర్థన్‌రెడ్డి, ల్యాదెళ్ల వెంకటేశ్వరస్వామి ఆలయంలో సర్పంచ్ శ్రావణ్యా అనిల్,
- ఆలయాల్లో ప్రత్యేక పూజలు
- మొక్కులు చెల్లించుకున్న భక్తులు
దామెర, జూన్ 29 : మండలంలో తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రజలు ఆలయాల్లో పూజలు చేశారు. ఊరుగొండలోని లక్ష్మీనర్సింహస్వామి ఆలయం, శివనాగేంద్రస్వామి ఆలయం, కోగిల్వాయిలో చెన్నకేశవస్వామి ఆలయంలో సర్పంచ్ సత్యనారాయణరెడ్డి, గట్ల విష్ణువర్థన్‌రెడ్డి, ల్యాదెళ్ల వెంకటేశ్వరస్వామి ఆలయంలో సర్పంచ్ శ్రావణ్యా అనిల్, పులుకుర్తి, ముస్త్యాలపల్లి ఆలయాల్లో భక్తులు పూజలు చేసి పసుపు, కుంకుమ, కొబ్బరిని సమర్పించి మొక్కులు చెల్లించారు. కార్యక్రమాల్లో ఎంపీపీ కాగితాల శంకర్, జడ్పీటీసీ కల్పన, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు గండు రామకృష్ణ, మండల ప్రధాన కార్యదర్శి ముదిగొండ కృష్ణమూర్తి, అర్చకులు తూపురాని శ్రీనివాసాచార్యులు, అఖిల కుమారాచార్యులు పాల్గొన్నారు.
వర్ధన్నపేటలో..
వర్ధన్నపేట : తొలి ఏకాదశి వేడుకలు మండలంలో ఘనంగా జరిగాయి. హిందువుల జరుపుకునే పండుగల్లో మొదటి పండుగ సందర్భంగా గ్రామాల్లో ప్రజలంతా దేవాలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయాల్లో అర్చకులు ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు చేశారు.
గీసుగొండలో…
గీసుగొండ : తొలి ఏకాదశిని పురస్కరించుకుని మండలంలోని కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి, ఎలుకుర్తి గ్రా మంలోని శివాలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. చుట్టు పక్కల గ్రామాల నుంచి భక్తులు ఆలయాలకు తరలివచ్చి పూజల్లో పాల్గొన్నారు. ఈ ఏడాదిలో మొదటగా వచ్చే పండుగను అన్ని వర్గాల ప్రజలు ఘనంగా జరుపుకున్నారు.
కనుల పండువగా శాకంబరీ ఉత్సవం
ఐనవోలు : భ్రమరాంబికాదేవి ఆలయంలో గురువారం శాకంబరీ ఉత్సవం కనుల పండువగా జరిగింది. తొలి ఏకాదశిని పురస్కరించుకొని ఉదయం నుంచే మల్లికార్జునస్వామి, భ్రమరాంబికాదేవి ఆలయాల్లో ఆకేరు వాగు నుంచి కొత్త జలాలతో స్వామి వారికి జలాభిషేకం నిర్వహించి అర్చకులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. దాత రేపల్లె రాజు అందించిన కూరగాయలతో మాలలుగా తయారు చేసి పండితులు వేద మంత్రాలు పఠిస్తూ అమ్మవారిని అలంకరించారు. అలాగే మహాగణపతి, శివుడు తదితర దేవతామూర్తుల విగ్రహాలకూ కూరగాయలతో అలంకరించారు. మల్లికార్జునస్వామికి భక్తులు పెద్ద సంఖ్యలో దర్శనం చేసుకొని బిందెలతో జలాభిషేకం చేశారు. పూజలో డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, జడ్పీ వైస్ చైర్మన్ గజ్లెల్లి శ్రీరాములు, ఆలయ కమిటీ చైర్మన్ మజ్జిగ జయపాల్, ఈవో అద్దెంకి నాగేశ్వర్రావు, ఉప ప్రధాన అర్చకులు పాతర్లపాటి రవీందర్, ముఖ్య అర్చకులు మధుకర్‌శర్మ, శ్రీనివాస్, నందనం మధుశర్మ, వేదపండితులు గుట్టు పురుషోత్తమ్మ శర్మ, నందనం భానూ ప్రసాద్, మడికొండ దేవేందర్, డైరెక్టర్లు పాల్గొన్నారు.
శాయంపేటలో..
శాయంపేట : వరంగల్ జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి బోనమెత్తుకుని బీరన్న దేవాలయానికి వెళ్లి సమర్పించారు. గురువారం మండలంలోని మైలారం గ్రామంలో యాదవులు నిర్వహించిన బోనాల జాతరలో చైర్పర్సన్ పాల్గొన్నారు. బీరన్న ఆలయంలో మొకులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీరన్న దయతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. గ్రామాల్లోని ఆచారాలు, సంప్రదాయాలు తెలంగాణకు ప్రత్యేకమన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గంగుల మనోహర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ శరత్, వైస్ చైర్మన్ తిరుపతిరెడ్డి, సర్పంచ్ అరికిల్ల ప్రసాద్, మాజీ సర్పంచ్ మసికె సదయ్య, వార్డు మెంబర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పర్వతగిరిలో..
పర్వతగిరి : మండలంలోని పలు గ్రామాల్లో గురువారం తొలి ఏకాదశి పండుగను పురస్కరించుకుని పూజలు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు దర్శనం చేసుకున్నారు. కల్లెడ శ్రీకొలను వేంకటేశ్వరస్వామి ఆలయంలో అర్చకుడు శ్రీరంగాచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జమాల్‌పురం షిరిడీ సాయిబాబా దేవాలయంలో పూజారి రమణాచారి బాబాకు ప్రత్యేక పూజలు, అర్చనలు చేశారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

