ఖాళీ కుర్చీలతో కాంగ్రెస్ సభ
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బయ్యారం శివారులో బుధవారం సాయంత్రం నిర్వహించిన కాంగ్రెస్ శంఖారావ సభ జనం లేక ఖాళీ కుర్చీలతో వెలవెలబోయింది. ఈ సభకు రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరావు, ఎమ్మెల్యే కోరం కనకయ్య, ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ హాజరుకావాల్సి ఉంది.
- మంత్రి తుమ్మల మాట్లాడకముందే వెళ్లిపోయిన ప్రజలు
- మంత్రి, ఎంపీ, అభ్యర్థి బలరాం నాయక్‌కు చేదు అనుభవం
- జనం లేక బయ్యారం శంఖారావ సభ వెలవెల
బయ్యారం, మే 8 : పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బయ్యారం శివారులో బుధవారం సాయంత్రం నిర్వహించిన కాంగ్రెస్ శంఖారావ సభ జనం లేక ఖాళీ కుర్చీలతో వెలవెలబోయింది. ఈ సభకు రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరావు, ఎమ్మెల్యే కోరం కనకయ్య, ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ హాజరుకావాల్సి ఉంది. మంత్రి రాక ఆలస్యమవుతుండడంతో ముందుగా వామపక్ష నాయకులు, ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థి సభను ప్రారంభించారు. కొద్దిసేపటికే జనం ఒక్కొక్కరుగా బయటికి వెళ్లిపోవడం కనిపించింది. దీంతో కాంగ్రెస్ నాయకులు వారిని అడ్డగించి మరీ సభా ప్రాంగణానికి రావాలని ప్రాధేయపడినప్పటికీ వారు వెళ్లిపోయారు. దీంతో మైదానంలో అన్నీ ఖాళీ కుర్చీలే కనిపించాయి. అనంతరం అక్కడకు చేరుకున్న మంత్రి తుమ్మల సైతం అరకొర జనం, ఖాళీ కుర్చీలు దర్శనమిస్తుండగానే ప్రసంగించారు. సభ పూర్తి కాకుండానే జనం వెనుదిరిగిపోవడంతో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు నిరుత్సాహానికి గురయ్యారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

