నమస్తే తెలంగాణ నెట్వర్క్, అక్టోబర్ 3 : చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతం గా నిలిచే దసరా పండుగను ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రజలు సంబురంగా జరుపుకొన్నారు. పాలపిట్ట దర్శనం అనంతరం జమ్మి చెట్ల వద్ద పండితుల వేద మంత్రోచ్ఛరణల మధ్య శమీ పూజ చేశారు. జమ్మి ఆకు ఒకొరికొకరు ఇచ్చిపుచ్చుకొని..అలయ్ బలయ్ తీసుకుని శుభాకాంక్ష లు చెప్పుకొన్నారు. పిల్లలు పెద్దల ఆశీర్వాదం తీసుకున్నారు. ఆయుధ, వాహన పూజలు గా వించారు. నవరాత్రులు పూజలందుకున్న దు ర్గామాత విగ్రహానికి ఘనంగా నిమజ్జన కార్యక్ర మం చేపట్టారు. పలు గ్రామాల్లో శోభా యాత్ర నిర్వహించారు.
ఈ సందర్భంగా చిన్నారులు, మహిళలు, యువకులు నృత్యాలు చేశారు. అనంతరం చెరువులు, కుంటల్లో అమ్మవారి విగ్రహాలను నిమజ్జనం చేశారు. రావణాసురు డి ప్రతిమలను దహనం చేసి సంబురాలు చేసుకొన్నారు. కాగా, పర్వతగిరి, చిన్నవడ్లేపల్లి సమీపంలో జరిగిన వేడుకల్లో మాజీ మంత్రి ఎర్రబె ల్లి దయాకర్రావు, మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, జనగామలోని బతుకమ్మకుంట వద్ద ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి పాల్గొన్నారు.
వరంగల్ ఉర్సు రంగలీలా మైదానంలో దసరా వేడుకలు అంబరాన్నంటాయి. తారాజువ్వల హరివిల్లు ప్రజలను కనువిందు చే సింది. ఆకాశంలోకి దూసుకెళ్లిన బాణసంచా వెలుతురుతో ఆ ప్రాంతమంతా మిరుమిట్లు గొలిపింది. వివిధ రకాల బాణసంచాతో భారీ రావణాసురుడి ప్రతిమను దహనం చేశారు. జనసంద్రంతో మైదానం కిక్కిరిసిపోయింది. పద్మనగర్ చిన్నవడ్డేపల్లి చెరువు సమీపంలో జరిగిన వేడుకల్లో 35 ఫీట్ల రావణ ప్రతిమను 20 రకాల బాణసంచాతో కాల్చడం, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. హనుమకొండ పద్మాక్షి గుట్ట, ఆయా జిల్లా, డివిజన్, మండల కేంద్రాల్లో రావణ వధ కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించారు.