హనుమకొండ సిటీ, జనవరి 19: వివిధ కళల్లో విద్యార్థులకు అందించే ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురసార అవార్డుకు ఎంపికైన జిల్లా విద్యార్థిని పెండ్యాల లక్ష్మి ప్రియ ఈ నెల 22న అవార్డును అందుకోనున్నట్లు విద్యార్థి తండ్రి రాకేశ్ తెలిపారు. ఢిల్లీలోని ఆనంద భవన్ లో రాష్ట్రపతి ద్రౌప్రది ముర్ము చేతుల మీదుగా బాల పురసార్ అవార్డు అందుకోనున్నట్లు పేరొన్నారు.
జనవరి 26న జరిగే రిపబ్లి క్ డే పరేడ్ కు రాష్ట్ర అంబాసిడర్గా హాజరై ప్రధానమంత్రి మోడీ, రాష్ట్రపతిని కలువ నున్నట్లు ఆయన తెలిపారు. కాగా కాజీపేట మౌంట్ ఫోర్ట్ లో 10వ తరగతి చదువు తున్న లక్ష్మీ ప్రియ గత సంవత్సరం జనవరిలో భువనేశ్వర్లో జరిగిన జాతీయస్థాయి కళా ఉత్సవాల్లో ప్రథమ బహుమతి అందుకోవడం విశేషం. బొంపల్లి సుధీర్ రావు పర్యవేక్షణలో ఏడు సంవత్సరాలుగా కూచిపూడిలో శిక్షణ తీసుకుంటూ వివిధ వేదికల్లో జాతీయ స్థాయిలో రాణిస్తోంది.