నల్లబెల్లి : రాష్ట్రంలో రేవంత్ సర్కార్ అవలంబిస్తున్న కర్షక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నల్లబెల్లి మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి(Peddi Sudarshan Reddy) నేతృత్వంలో కర్షకులు కన్నెర్ర చేస్తూ నిరసన గళం విప్పారు. ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. మాట్లాడుతూ ఎన్నికల హామీలో భాగంగా 420 హామీలు ఇచ్చి హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్( Congress) ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా పూటకో మాట చెబుతూ దాటవేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి రానున్న స్థానిక ఎన్నికల్లో అన్ని వర్గాల ప్రజలు గుణపాఠం చెప్పేందుకు సంసిద్ధులు కావాలని ఆయన పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ నమ్ముకుంటే కష్టాలు తప్పవన్నారు. బీఆర్ఎస్ పార్టీతోనే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు బానోత్ సారంగపాణితో పాటు మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు, రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా నర్సంపేట నియోజకవర్గంలోని 179 గ్రామాలలో రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.