నర్సంపేట, ఫిబ్రవరి14 : సీసీఐ పత్తి కొనుగోళ్లలో అక్రమాలపై వెంటనే సీబీఐతో విచారణ జరిపించాలని, ఇది భారీ స్కామ్ అని, సుమారు రూ.వెయ్యి కోట్ల అవినీతి జరిగిందని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం నర్సంపేట పట్టణంలో ఆయన మాట్లాడుతూ.. రైతులను కాంగ్రె స్ ప్రభుత్వం నిలువు దోపిడీ చేసిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సీసీఐ, వ్యవసాయశాఖ మధ్య దళారులు, పెట్టుబడి దారులు, మార్కెట్ అధికారులు కు మ్మకై కొనుగోళ్ల విషయంలో పత్తి రైతులకు తీరని అన్యాయం చేశారని విమర్శించారు. క్వింటాలు పత్తికి రూ.7,521 మద్దతు ధర రావాల్సి ఉండగా, ప్రైవేటు వ్యాపారులు కేవలం రూ.5వేలు, రూ.6వేలు మాత్ర మే చెల్లించడంతో రైతులు కుదేలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఏడు వ్యవసాయ మార్కెట్ల కార్యదర్శలను ఇటీవల సస్పెండ్ చేయడమే ఇందుకు నిదర్శనమని మండిపడ్డారు. రాష్ట్రంలోని అన్ని వ్యవసాయ మార్కెట్లలో ఈ కుంభకోణం జరిగిందన్నారు. మార్కె ట్ కార్యదర్శులు, మధ్యవర్తులు సీసీఐ అధికారులతో కలిసి రైతులను మోసం చేశారని అన్నారు.
క్వింటాల్‌కు రూ.2వేల దోపిడీ జరిగిందని, 5 లక్షల టన్నుల పత్తి కొనుగోళ్లలో అవినీతి జరిగినట్లు ఆధారాలు బయటకొచ్చాయని చెప్పారు. 8.42 లక్ష ల మంది రైతుల నుంచి రూ.14,921 కోట్ల విలువైన 20.15 లక్షల టన్ను ల పత్తిని సీసీఐ కొనుగోలు చేసిందన్నారు. అందులో అధికారికంగా ్రప్రైవేటు వ్యాపారులు విక్రయించింది 3.16 లక్షల టన్నులు కాగా, అనధికారికంగా జనవరి చివరి వరకు సుమారు 8లక్షల టన్నుల పంటను రైతుల నుంచి కొనుగోలు చేశారని పెద్ది అన్నారు. ఇందులో 5 లక్షల టన్నుల వరకు రైతుల నుంచి తక్కువ ధరకు కొని అక్రమంగా టీఆర్‌లు పొందడం ద్వారా సీసీఐకి మద్దతు ధరకు అమ్మినట్లు తెలిసిందని వివరించారు. ఇంతపెద్ద కుంభకోణం వెనకాల పెద్దల హస్తం లేకపోలేదన్నారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాలనలో మా ర్కెట్లో ఏనాడూ ఎలాంటి ఆరోపణలు రాలేదని స్పష్టం చేశారు. నిత్యం సమీక్షలు, సమావేశాలతో మా ర్కెటింగ్ వ్యవస్థ అద్భుతంగా పనిచేసిందన్నారు. కాంగ్రెస్ రాగానే ఈ రకమైన కుంభకోణానికి పాల్పడిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రికి, వ్యవసాయశాఖ మంత్రికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశా రు. పత్తి కొనుగోళ్లలో అక్రమాలపై బీఆర్ఎస్ పోరా టం చేస్తుందని, సంబంధిత అధికారికి రాత పూర్వక ఫిర్యాదు అందజేస్తామని పెద్ది స్పష్టం చేశారు.