నర్సంపేట (ఖానాపురం), నవంబర్ 13 : సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల చేపట్టిన వరంగల్ జిల్లా పర్యటన కాలక్షేపానికే తప్ప రైతులతో పాటు ముంపు బాధితులకు ఒరిగిందేమీ లేదని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విమర్శించారు. గురువారం ఖానాపురం మండలం అశోక్‌నగర్ గ్రామం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయ న మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలన కొనసాగుతున్నదన్నారు. ఇటీవల కురిసిన మొంథా తుపాను వల్ల జిల్లా వ్యాప్తంగా వేలాది ఎకరాల్లో పంటకు నష్టం వాటాల్లిందన్నారు. ము ఖ్యంగా వరి, మక్కజొన్న, పత్తి పంటలు పూర్తిగా నేలమట్టమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. వరంగల్‌కు వచ్చిన సీఎం రేవంత్ ఒక్క రైతును ప రామర్శించలేదని విమర్శించారు. పంట నష్టం స ర్వే పూర్తిగా అధికార పార్టీ నాయకుల సూచనల మేరకే నడుస్తున్నదని, ఇది మంచి పద్ధతి కాదని అన్నారు. పార్టీలు మారితేనే పంట నష్టం వస్తుందంటూ మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతలను హెచ్చరించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎలాంటి రాజకీయాలు లేకుండా ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీలకు కొనుగోలు కేంద్రాలు అప్పజెప్పామన్నారు. స్థానిక ఎమ్మెల్యే చోటా, మోటా లీడర్లకు సెంటర్లు ఇస్తూ రైతులను దోచుకుతింటున్నార ని విమర్శించారు. నర్సంపేట నియోజకవర్గం లో 50 వేల ఎకరాల్లో నష్టం వాటిల్లితే వ్యవసాయశాఖ అధికారులు కేవలం 10 వేల ఎకరాల్లోనే పంటలు దెబ్బితిన్నట్లు రిపోర్టు ఇవ్వడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. యూరియా కొరతతో సగం పంట దెబ్బతింటే తుపానుతో పూర్తిగా నష్టపోయినట్లు పేర్కొన్నారు. కలెక్టర్ స్పందించి ఏకపక్షంగా సాగుతున్న సర్వేలను రద్దు చేయాలని, గ్రామ సభల ద్వారా నష్టాన్ని అంచనా వేయాలని డిమాండ్ చేశారు.
గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సుమారు రూ. 60 కోట్ల పరిహారాన్ని అందించినట్లు పెద్ది గుర్తు చేశారు. సమావేశంలో ఓడీసీఎంఎస్ మాజీ చైర్మన్ గుగులోత్ రామస్వామినాయక్, మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాష్‌రావు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మహాలక్ష్మి వెంకటరాంనర్సయ్య, వ్యవసాయ మార్కెట్ కమిటీ మా జీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్‌గౌడ్, మాజీ సర్పంచ్‌లు ప్రవీణ్, సోమయ్య, పద్మ, వెంకన్న, మాజీ జడ్పీటీసీ బాలునాయక్, ముఖ్య నాయకులు యాదగిరిరావు, హట్యానాయక్, కుమారస్వామి, రవి, లక్ష్మణ్నాయ క్, కోరె సుధాకర్, తక్కళ్లపల్లి బాబురావు, జాటోత్ బాలు, శ్రీనివాస్, అశోక్, రవి, రాము పాల్గొన్నారు.