నర్సంపేట, ఏప్రిల్11: కేసీఆర్ పదేళ్ల పాలన స్వర్ణయుగమని, రాష్ట్ర ప్రజల గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచారని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం నర్సంపేటలో బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ విజయవంతానికి ముఖ్య నాయకుల సన్నాహక సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పెద్ది హాజరై మాట్లాడారు. భవిష్యత్తు బీఆర్ఎస్ పార్టీదేనని అన్నారు. రజతోత్సవ మహా సభ సంబురాలు అంబరాన్నంటాలని పిలుపునిచ్చారు. ఉద్యమ పార్టీకి 25 ఏళ్లు పూర్తయ్యాయని చెప్పారు.
ప్రపంచ చరిత్రలో నిలిచిపోయే సభలు నిర్వహించిన సత్తా బీఆర్ఎస్ పార్టీదేనని ఆయన గుర్తు చేశారు. మండలాలు, గ్రామాల్లో చర్చ పెట్టాలని, కేసీఆర్‌ను చూడాలని, సభకు రావాలని కార్యకర్తలు, ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభిస్తుందన్నారు. కేసీఆర్ నాయకత్వంతోనే తెలంగాణ అభివృద్ధి సాధిస్తుందని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. డివిజన్ నుంచి 25వేల మంది కార్యకర్తలకు ఒక్కరు తక్కువ కాకుండా వచ్చి నర్సంపేట పోరాట పటిమను, సత్తా చాటాలని పెద్ది కోరారు.
బీఆర్ఎస్ కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలో జెండాను ఎగురవేయాలన్నారు. ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తున్నదని, ప్రజలకు అండగా కేసీఆర్ ఉన్నారని చెప్పారు. అనంతరం బీఆర్ఎస్ నాయకులతో కలిసి రజతోత్సవ మహాసభ వాల్‌పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామినాయక్, ఆర్ఎస్ఎస్ రాష్ట్ర మాజీ డైరెక్టర్ రాయిడి రవీందర్‌రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మునిగాల వెంక ట్‌రెడ్డి, బీఆర్ఎస్ నర్సంపేట పట్టణ, మండల అధ్యక్షులు నాగె ళ్లి వెంకటనారాయణగౌడ్, నామా ల సత్యనారాయణ, నాయకులు డాక్టర్ లెక్కల విద్యాసాగర్‌రెడ్డి, బానోత్ సారంగపాణి, వేము లపల్లి ప్రకాశ్‌రావు, బాల్నే వెంకన్న, ఊడ్గుల ప్రవీణ్, రాజేశ్వర్‌రావు, గోనె యువరాజ్, మండల శ్రీనివాస్, బండి రమేశ్, సదానందం, నాగిశెట్టి ప్రసాద్, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.