ఖానాపురం, జూన్ 18: సీఎం రేవంత్‌రెడ్డి డీఎన్ఏలోనే తెలంగాణ లేదని, అలాంటప్పుడు రాష్ట్ర అభివృద్ధి ఎలా జరుగుతుందని నర్సంపేట మాజీ ఎమ్మేల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విమర్శించారు. బుధవారం వరంగల్ జిల్లా ఖానాపురం మండల కేంద్రంలోని రెడ్డి పెద్దరంగారెడ్డి ఫంక్షన్హాల్లో నిర్వహించిన మండలస్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో పెద్ది మాట్లాడారు. ఏనాడూ జై తెలంగాణ అనని రేవంత్‌రెడ్డి సీఎం కుర్చీ లో కూర్చోవడం ఉద్యమకారులు, అమరులు, 4 కోట్ల మంది ప్రజలకు అవమానమన్నారు. రేవంత్‌రెడ్డి, చంద్రబాబు బుద్ధి ఒకేలా ఉంటుందని, వారు తెలంగాణకు వ్యతిరేకమన్నారు. ఎకరాకు రూ. 15 వేలు రైతు భరోసా ప్రకటించిన కాంగ్రెస్ ప్రస్తుతం రూ. 12 వేలు మాత్రమే ఇస్తున్నదని మండిపడ్డారు.
అదికూడా ఎకరాకు రూ. 25 వేలు బాకీ ఉండగా స్థానిక ఎన్నికల కోసం రూ. 6 వేలు మాత్రమే రైతుల ఖాతాల్లో జమచేస్తున్నదని విమర్శించారు. మహిళలకు నెలకు రూ. 2,500 ఇస్తామని మ్యానిఫెస్టోలో పెట్టి 18 నెలలుగా ఒక్క రుపాయి ఇవ్వలేదన్నారు. ఎన్నికల కోసం గ్రామాలకు వచ్చే కాంగ్రెస్ నాయకులను మహిళలు నిలదీయాలని పిలుపునిచ్చారు. పాకాలకు గోదావరి జలాలతో పాటు మంగళవారిపేట గిరిజన రైతుల పోడు భూములకు పట్టాలిచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. తాను ఖానాపురం, చెన్నారావుపేట మండలాల అభివృద్ధి కోసం మంజూరు చేయించిన కోట్లాది నిధులను ప్రస్తుత ఎమ్మెల్యే వాపస్ పంపించాడన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్ నాయకులు కలిసికట్టుగా పనిచేసి గ్రామగ్రామాన గులాబీ జెండా ఎగురవేయాలని పెద్ది పిలుపునిచ్చారు. ఎన్నికల్లో ఎవరికి అవకాశమిచ్చినా అందరూ ఏకతాటిపై పనిచేయాలన్నారు. ప్రజాస్పందన బీఆర్ఎస్కు అనుకూలంగా ఉందని, మెజారిటీ స్థానాలను పార్టీ కైవసం చేసుకునేలా కార్యకర్తలు కృషిచేయాలన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని, అప్పుడే మెరుగైన ఫలితాలు వస్తాయన్నారు. సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు మహాలక్ష్మి వెంకటనర్సయ్య, సొసైటీ చైర్మన్ రామస్వామినాయక్, మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు, ఏఎంసీ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్‌గౌడ్, మస్తాన్, మౌలానా, అజహర్, కోరె సుధాకర్, బాబురావు, జాటోత్ బాలు, గుగులోత్ బాలు, ప్రవీణ్‌కుమార్, సునీత, సంపత్, కుమారస్వామి, యువరాజు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.