Collector Rizwan | ప్రభుత్వ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి : కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
Collector Rizwan | అర్హులైన విద్యార్థులకు ప్రభుత్వం బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో చదువుకునే అవకాశం కల్పిస్తుందని, ఎంపికైన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు.
జోగులాంబ గద్వాల : అర్హులైన విద్యార్థులకు ప్రభుత్వం బెస్ట్ అవైలబుల్ ( Best Available ) పాఠశాలల్లో చదువుకునే అవకాశం కల్పిస్తుందని, ఎంపికైన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ( Collector Rizwan Basha Sheikh ) అన్నారు. జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఐడివోసి సమావేశపు మందిరంలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో చదువుకునేందుకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులను లక్కీ డిప్ విధానంలో కలెక్టర్ ఎంపిక చేశారు.
నాన్ రెసిడెన్షియల్ ఒకటవ తరగతిలో ప్రవేశాలకు మొత్తం 57 సీట్లు ఉండగా, మొత్తం 265 మంది దరఖాస్తు చేసుకోగా గ్రూప్ 1, 2, 3లకు సంబంధించి మహిళా రిజర్వేషన్స్, జనరల్ కోటాలో నిబంధనల ప్రకారం డిప్ ద్వారా విద్యార్థులను ఎంపిక చేశారు. రెసిడెన్షియల్ ఐదవ తరగతిలో ప్రవేశాలకు మొత్తం 59 సీట్లు ఉండగా గ్రూప్ 1, 2, 3లకు సంబంధించి మొత్తం 310 మంది దరఖాస్తు చేసుకోవడంతో అర్హులైన వారిలో నుంచి డిప్ విధానంలో విద్యార్థులను ఎంపిక చేశారు.
వివిధ గ్రూపులకు సంబంధించి వెయిటింగ్ లిస్టు ప్రాతిపదికన కొంతమంది విద్యార్థులను కూడా డిప్ విధానంలో ఎంపిక చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎంపికైన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి నుషిత, ఏఎస్సీడబ్ల్యూవో నాగరాజు, సెక్టోరియల్ అధికారి కర్రెప్ప, బీచుపల్లి గురుకుల విద్యాలయ ప్రిన్సిపల్ రామాంజనేయులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

