Kane Williamson | అంతర్జాతీయ క్రికెట్‌కు విలియమ్సన్ వీడ్కోలు.. ఎందుకీ షాకింగ్ నిర్ణయం..!
Kane Williamson : న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (Kane Williamson) అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.ఫ్యాబ్-4లో ఒకడిగా పేరొందిన విలియమ్సన్ ఉన్నట్టుండి తన సుదీర్ఘ కెరీర్‌ను ముగిస్తున్నానని ప్రకటించాడు.
Kane Williamson : న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్(Kane Williamson) అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. క్లాస్ ఆటతో ఫ్యాబ్-4లో ఒకడిగా పేరొందిన విలియమ్సన్ ఉన్నట్టుండి తన సుదీర్ఘ కెరీర్‌ను ముగిస్తున్నానని ప్రకటించాడు. తన సొగసైన ఆటతో, సమర్ధ నాయకత్వంతో కివీస్ క్రికెట్‌పై చెరగని ముద్ర వేసిన ఈ లెజెండరీ ఆటగాడు ఇంగ్లండ్ సిరీస్ మధ్యలోనే రిటైర్మెంట్ ప్రకటించడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
పదహారేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన కేన్ విలియమ్సన్ హఠాత్తుగా వీడ్కోలు చెప్పేశాడు. ఇంగ్లండ్‌తో మూడు టెస్టుల సిరీస్ మధ్యలోనే ఈ దిగ్గజం నేను ఇక ఆడలేను అంటూ ఆటకు అల్విదా పలికాడు. లార్డ్స్ టెస్టులో ఆతిథ్య జట్టు చేతిలో ఘోర పరాభవంతో బాధ పడిన విలియమ్సన్ ఈ కఠిన నిర్ణయానికి వచ్చాడు.
🚨 Kane Williamson has announced his retirement from all international cricket pic.twitter.com/atBWA1WfKS
— ESPNcricinfo (@ESPNcricinfo) June 12, 2026
‘వీడ్కోలుపై నేను కొన్నిసార్లు ఆలోచించాను. అయితే.. గత కొన్ని రోజులుగా రిటైర్మెంట్ ఆలోచనలు నన్ను చుట్టుముట్టాయి. ఆటను వదిలేసేందుకు ఇదే సరైన సమయం అనిపించింది. అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు నేను ఎంతో ఆకలితో ఉండేవాడిని. న్యూజిలాండ్‌కు ఆడిన ప్రతి మ్యాచ్‌లో నా శక్తినంతా ధారపోసినందుకు చాలా గర్వంగా ఉంది. మునపటిలా ఆడలేనప్పుడు ఆటలో కొనసాగడం సరిగా అనిపించలేదు. స్వచ్ఛందంగా క్రికెట్‌కు వీడ్కోలు పలకడాన్ని అదృష్టంగా భావిస్తున్నా’ అని విలియమ్సన్ వెల్లడించాడు.
Kane Williamson signs off from international cricket with 19,346 runs to his name 🌟 pic.twitter.com/XOIz1lTbQ0
— ESPNcricinfo (@ESPNcricinfo) June 12, 2026
ప్రపంచ టెస్టు ఛాంపియన్
ఫ్యాబ్ 4లో తన జోరు చూపించిన విలియమ్సన్.. విరాట్ కోహ్లీ, జో రూట్, స్టీవ్ స్మిత్‌లతో పోటీగా క్రేజ్ సంపాదించుకున్నాడు. 2021లో న్యూజిలాండ్‌ను ప్రపంచ టెస్టు ఛాంపియన్‌గా నిలిపాడు. అంతేనా.. 2019లో బ్లాక్ క్యాప్స్‌ను వన్డే వరల్డ్‌కప్ ఫైనల్ చేర్చిన విలియమ్సన్.. అంపైర్ నిర్ణయంతో కప్ చేజారినా కోట్లాది మంది మనసులు గెలుచుకున్నాడు.
A Test career for the ages, Kane ⭐ pic.twitter.com/7tf7Tt7s33
— ESPNcricinfo (@ESPNcricinfo) June 12, 2026
నిరుడు నవంబర్‌లో అంతర్జాతీయ టీ20లకు గుడ్ బై చెప్పిన కేన్ మామ.. ఇప్పుడు తనకెంతో ఇష్టమైన టెస్టు, వన్డే ఫార్మాట్ల నుంచి కూడా వైదొలిగాడు. ఐపీఎల్‌లోనూ తనదైన శైలిలో మెరుపులు మెరిపించిన కేన్ మామ.. సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిథ్యాన్ని వహించాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్‌పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

