నర్సంపేట, జనవరి27: కాంగ్రెస్‌కు ప్రజా తిరుగుబాటు తప్పదని, స్పష్టత లేని పాలనను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడు తూ వాయిదాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూటకోమాటతో ప్రజలను మోసం చేస్తున్నాడని అన్నారు. ప్రభుత్వ పనితీరు, ప్రజాగ్రహంతో అధికారులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని పేర్కొన్నారు. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన జనవరి 26ను ఝూ టా మాటలతో కాంగ్రెస్ ప్రభుత్వం అవమానించిందన్నారు.
వంద రోజుల్లో అన్ని హామీలు అమలు చేస్తామని చెప్పి 400 రోజులు దాటినా ఇప్పటికీ సంక్షేమ పథకాల అమలుపై ప్రజలకు స్పష్టత ఇవ్వని ఆసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. సర్కా రు అస్పష్ట విధానాలతో అధికారులు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారని, ప్రజల్లో ప్రభుత్వ ఉద్యోగులపై గౌరవం తగ్గిపోతున్నదన్నా రు. కేవలం ఒక్క శాతం పథకాలు మాత్రమే ప్రారంభించారని, ప్రజలను నిరాశ పరిచిన ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలన్నారు. పథకాల అమలు కోసం మండలానికి ఒక చిన్న గ్రామాన్ని ఎంచుకున్నారని, అన్ని గ్రామాల్లో అర్హులైన వారికి అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రారంభించిన పథకాల అమలుపై ప్రజలకు పూర్తిస్థాయిలో విశ్వాసం లేదన్నారు.
ఈ నెల 26 నుంచి 4 పథకాలు అందిస్తామని చెప్పి ఇప్పుడు ఫిబ్రవరి మొదటి వారం నుంచి మార్చి 31 వరకు అమలు చేస్తామంటూ మరోమారు ప్రజలను కాంగ్రెస్ మోసం చేస్తున్నదన్నారు. రేవంత్ సర్కారు ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు ఒక్క పథకం కూడా పూర్తిగా అమలు చేయలేదన్నారు. ముఖ్యంగా రైతులకు రుణమాఫీ 30శాతం మాత్రమే చేసిందని, బోనస్, రైతు భరోసాపై కాంగ్రెస్ మాట తప్పి మోసం చేసిందన్నా రు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసాతో రైతు కూలీలను దగా చేసిందని, కౌలు రైతులకు భరోసాలో స్థానం లేకుండా చేసిందన్నారు. గ్రామసభల్లో ప్రజలు చూపించిన నిరసన ప్రారంభమేనని, భవిష్యత్తులో ఎమ్మెల్యేలు గ్రామాల్లో తిరగలేరన్నారు. మహిళలు, రైతులు, నిరుద్యోగులు, యువకులు, ఉద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతను చూపిస్తున్నారని పెద్ది పేర్కొన్నారు.