చెన్నారావుపేట, అక్టోబర్ 7 : అలవికాని హామీలిచ్చి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ సర్కారుకు స్థానిక ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని మాజీ ఎమ్మెల్యే పెద్ది సు దర్శన్‌రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మండల కేంద్రలోని పలు దుకాణాలు, బస్సుల్లో ప్రయాణిస్తున్న వారికి అందజేశారు.
ఈ సందర్భంగా పెద్ది మాట్లాడుతూ దొంగ హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి 700 రోజులైనా పట్టించుకోవడం లేదన్నారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రైతులు, మహిళలు, యువకులు, నిరుద్యోగులు, వృద్ధులతో పాటు అన్ని వర్గాలను మోసం చేసిందన్నారు. యూరియా దొరకక అరకొరగా పండిన పంటలకు గిట్టుబాటు ధర సైతం కల్పించడం లేదని, ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాలను కూడా ప్రారంభించలేదన్నారు. హామీలు అమలు చేయకుండా తప్పించుకు తిరుగుతున్న కాంగ్రెస్ నాయకులను స్థానిక ఎన్నికల సందర్భంగా ప్రజలు నిలదీయాలన్నారు.
రానున్న ఎన్నికల్లో తమ శ్రేణులను కాంగ్రెస్ పెద్దలు బలిపశువులను చేయాలని చూస్తున్నారని, ఈ విషయాన్ని కార్యకర్తలు గుర్తించాలని పెద్ది సూచించారు. కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు బాల్నె వెంకన్న, మండల ఎన్నికల కన్వీనర్ జక్క అశోక్, పీఏసీఎస్ డైరెక్టర్లు చింతకింది వంశీ, మురహరి రవి, మాజీ జడ్పీటీసీ పత్తినాయక్, అధికార ప్రతినిధి కృష్ణచైతన్యరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ అనుముల కుమారస్వామి, అమ్మ రాజేశ్, కొండవీటి ప్రదీప్‌కుమార్, ప్రధాన కార్యదర్శి భూక్యా రవీందర్, నాయకులు కుండె మల్లయ్య, రఫీ, బోడ మురళీనాయక్ తదితరులు పాల్గొన్నారు.