నెక్కొండ, అక్టోబర్ 7 : రాష్ట్రంలో దోఖాబాజీ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్‌గా కాంగ్రెస్ పార్టీ నిలుస్తున్నదని, ఆ పార్టీ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో చిత్తవడం ఖాయమని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. నెక్కొండలో మంగళవారం ఆర్టీసీ బస్సులు, దుకాణాలు, ఇంటింటికీ వెళ్లి కాంగ్రెస్ బాకీకార్డులు పంపిణీ చేసి మాట్లాడారు. ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీల హామీలిచ్చి ప్రజలను దగా చేసిందని, ఒక్కో కుటుంబానికి ఎంతెంత కాంగ్రెస్ పార్టీ బాకీ పడిందో తెలుపడమే తమ లక్ష్యమన్నారు. ఆ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే ధైర్యంలేక బీసీ రిజర్వేషన్ల పేరిట డ్రామాలకు తెరలేపిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ చేసిన మోసాలపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని, పార్టీ నాయకులకు ఎన్నికల్లో నిలబడే ధైర్యం లేదన్నారు.
ప్రతి పల్లెల్లో వారిని నిలదీసే పరిస్థితులు ఉత్పన్నమయ్యాయన్నారు. కాంగ్రెస్ చేసిన మోసానికి ప్రజలు ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. యూరియాను సకాలంలో రైతులకు అందించలేకపోయిందని, 60 శాతం దిగుబడులు తగ్గి ఆర్థిక వ్యవస్థ మీద పంటల నష్టం తీవ్ర ప్రభావాన్ని చూపుతుందన్నారు. కాంగ్రెస్ బాకీ కార్డులు ప్రజలందరికీ అర్థమయ్యే రీతిలో ప్రతి ఇంటింటికీ బీఆర్ఎస్ శ్రేణులు వెళ్లి పంపిణీ చేయాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సంగని సూరయ్య, ప్రధాన కార్యదర్శి తాటిపెల్లి శివకుమార్, పట్టణ అధ్యక్షుడు కొణిజేటి భిక్షపతి, నెక్కొండ, రెడ్లవాడ సొసైటీ చైర్మన్లు మారం రాము, జలగం సంపత్‌రావు, సీనియర్ నాయకుడు, న్యాయవాది కొమ్ము రమేశ్‌యాదవ్, మాజీ ఎంపీపీ జాటోత్ రమేశ్‌నాయక్, మాజీ జడ్పీటీసీ లావుడ్యా సరోజన, సొసైటీ మాజీ చైర్మన్ కొమ్మారెడ్డి రవీందర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గుంటుక సోమయ్య, నాయకులు దేవనబోయిన వీరభద్రయ్య, ఈదునూరి వెంకన్న, పీ సత్యం, ఈ యాకయ్య, ఎం రాజు, బొడ్డుపెల్లి రాజు, ఖలీల్ పాల్గొన్నారు.
మహబూబాబాద్ రూరల్, అక్టోబర్ 7 : స్థానిక ఎ న్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించడంపై కాంగ్రెస్ డ్రామాలు చేస్తున్నదని మహబూబాబాద్ మా జీ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ అన్నారు. మంగళవారం మానుకోట పట్టణంలోని క్యాంపు కార్యాలయం లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అనేక మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందని, నిరుపేదల సంక్షేమ కోసం ఒక్క పథకాన్ని ప్రవేశ పెట్టలేదన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయని కాంగ్రెస్‌కు స్థానిక ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టాలన్నారు.
ఆరు గ్యారెంటీ లు, 420 హామీలను ప్రకటించి నిరుపేదలను మోసం చేసిందన్నారు. బీఆర్ఎస్ శ్రేణులు ఏకమై స్థానిక ఎన్నికల్లో పార్టీ సత్తాను చాటాలన్నారు. ఇప్పటికీ రైతులు యూరియా కోసం అరిగోస పడుతున్నారని, ప్రజలకు పథకాలు అందడం లేదని, ప్రతి గ్రామంలో కాంగ్రెస్ మోసాలను ఎండగట్ట్డాలన్నారు. కేసీఆర్ కుటుంబంపై సీఎం రేవంత్‌రెడ్డి దృష్టి పెట్టకుండా ప్రజలకు మంచి పాలన అందించాలని శంకర్‌నాయక్ హితవు పలికారు. సమావేశంలో నాయకులు గద్దె రవి, ఎండీ ఫరీద్, రంజిత్, తేళ్ల శ్రీను, లునావత్ అశోక్ నాయక్, సుధగాని మురళి, నర్సింగ్ వెంకన్న, ఆవుల వెంకన్న, నలమాల శ్రీను, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. కాగా, అయోధ్య గ్రామానికి చెందిన వాంకుడోత్ భాస్కర్ మంగళవారం బీఆర్ఎస్లో చేరగా శంకర్ నాయక్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
మరిపెడ, అక్టోబర్ 7: కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ చేస్తున్న మోసాలను వివరించాలన్నారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గుడిపూడి నవీన్‌రావు అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి బీసీలపై కపట ప్రేమ చూపిస్తూ దొంగ జీవోలు సృష్టించి మోసం చేస్తున్నాడని ఆరోపించారు. హైకోర్టు మొట్టికాయలు వేయడంతో బీసీ రిజర్వేషన్లపై సాధ్యంకాని జీవోను తీసుకొచ్చి స్థానిక ఎన్నికల ప్రకటన చేయించారన్నారు. తప్పుల తడక రిజర్వేషన్లపై వారి అనుచరుల ద్వారా కోర్టులో కేసులు వేయించి ఎన్నికలను వాయిదా వేయించేందుకు కాంగ్రెస్ చూస్తున్నదన్నారు. ఎన్నికలను కోర్టే అడ్డుకుందని చెప్పే ప్రయత్నం చేస్తున్నదని మండిపడ్డారు.
డోర్నకల్ నియోజకవర్గంలోని ఏడు మండలాల జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్ల స్థానాల్లో బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని, ఇందుకోసం కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలన్నారు. రైతులు ఒక్క యూరియా బస్తా కోసం రోజుల తరబడి అరిగోస పడ్డారని, ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందన్నారు. రిజర్వేషన్ల వారీగా ఆయా గ్రామాల్లోని బీఆర్ఎస్ అభ్యర్థులను గుర్తించి వారి విజయానికి దోహదపడాలని సూచించారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థులు భయపడుతుంటే బీఆర్ఎస్లో తీవ్ర పోటీ నెలకొన్నదన్నారు. బీఆర్ఎస్ శ్రేణులపై అక్రమ కేసులు పెట్టేందుకు కాంగ్రెస్ నాయకులు ప్రయత్నిస్తున్నారని, తనపై కూడా బనాయించారని రెడ్యా గుర్తు చేశారు. సమావేశంలో ఓడీసీఎంఎస్ మాజీ చైర్మన్ కుడితి మహేందర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ గుగులోత్ వెంక న్న, నాయకులు అచ్యుతరావు, రాంబాబు, తేజా వత్ రవీందర్, జరుపుల కాలునాయక్, శాస్త్రి, సుదర్శన్‌రెడ్డి, తాళ్లపల్లి శ్రీను, తాళ్లపల్లి రఘు, గండి మహేశ్, గడ్డం శ్రీను తదితరులు పాల్గొన్నారు.