హనుమకొండ, సెప్టెంబర్ 22 : ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయని సీఎం రేవంత్‌రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతనే మేడారంలో అడుగుపెట్టాలని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆదివారం హనుమకొండలోని వేయిస్తంభాల దేవాలయంలో సమ్మక, సారలమ్మ ప్రతిరూపాలైన మహిళల సాక్షిగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు ముగ్గురు మంత్రులు బతుకమ్మను అవమాన పరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సద్దుల బతుకమ్మ, సజ్జల బతుకమ్మ అని మం త్రులు మాట్లాడగా 6 గ్యారెంటీలు, రేవంత్‌రెడ్డి పాటలు వేశారని ధ్వజమెత్తారు. రాష్ట్ర సాధనోద్యమంలో స్ఫూర్తినిచ్చిన బతుకమ్మను అవమానపరిచిన సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళిక లేకపోవడంతోనే యూరియా కొరత ఏర్పడిందని, తద్వారా రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సోమవారం ఉద యం వరకే 250 చోట్ల యూరియా కోసం క్యూ లో నిల్చున్నారన్నారు.
కాంగ్రెస్ విధానాలతో యూరియా కోసం వృద్ధులు, మహిళలు చంటి బిడ్డలతో సహా బారులు తీరుతున్నారని అన్నా రు. యూరియా సకాలంలో అందక పంటలు ఎర్రబడి దిగుబడి తగ్గే ప్రమాదం ఉందన్నారు. గ్రెయిన్ మారెట్లో మకజొన్న కొనే దికులేదన్నారు. ప్రభుత్వం సర్వే చేయించి దిగుబడి తగ్గిన పంటలకు రూ. 25వేలు సబ్సిడీ రూపంలో నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మేడారం సమ్మక సారలమ్మ సాక్షిగా రైతులకు రేవంత్‌రెడ్డి అనేక హామీలిచ్చి అమలు చేయలేదన్నారు. రేవంత్‌రెడ్డి దేవుళ్ల మీద మోసపూరిత ఒట్లు వేయడం వల్లనే ఆర్థిక వ్యవస్థలో నష్టం వాటిల్లిందన్నారు.
గతంలో కేసీఆర్ రామప్ప, లక్నవరం నుంచి జంపన్న వాగుకు గోదావరి నీళ్లు ఇచ్చేలా ప్రణాళిక రూపొందించారని, దీనిపై సీఎం సమీక్షించి స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు. అంతేకాక రాబోయే మేడారం జాతర వరకు జంపన్నవాగులో గోదావరి జలాలను పారించాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే దమ్ము కాంగ్రెస్‌కు, రేవంత్‌కు లేదన్నారు.
స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సరైన జడ్జిమెంట్ ఇచ్చేందుకు గ్రామీణ ప్రాంత ప్రజ లు సిద్ధంగా ఉన్నారని సుదర్శన్‌రెడ్డి చెప్పారు. సమావేశంలో రైతు రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, డీసీసీబీ డైరెక్టర్ చెట్టుపల్లి మురళి, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కోఆర్డినేటర్ పులి రజినీకాంత్, నాయకులు భరత్ కుమార్‌రెడ్డి, సల్వాజీ రవీందర్రావు, రెంటాల కేశవరెడ్డి, శరత్ చంద్ర, పెరికారి శ్రీధర్‌రావు తదితరులు పాల్గొన్నారు.