హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 4: ఈ నెల 10, 11, 12 తేదీలలో వరంగల్ నగరంలో నిర్వహించాల్సిన ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం(పీడీఎస్‌యూ) తెలంగాణ రాష్ట్ర 23వ మహాసభలను తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ కారణంగా జనవరి 5,6,7 తేదీలకు వాయిదా వేస్తున్నట్లు సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.వి.శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి పొడపంగి నాగరాజు తెలిపారు. గురువారం హనుమకొండ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలమూలంగా రాష్ట్ర మహాసభల నిర్వహణ ఇబ్బంది అవుతున్నదని ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాష్ర్ట మహాసభలను జనవరికి వాయిదా వేస్తున్నట్లు వారు ప్రకటించారు. ఈ విషయాన్ని రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు, ప్రగతిశీలవాదులు, విద్య అభిమానులు గమనించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. సమావేశంలో పీడీఎస్‌యూ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు గుర్రం అజయ్, ప్రధాన కార్యదర్శి మర్రి మహేష్, రాష్ర్ట 23వ మహాసభల ఆహ్వాన సంఘం నాయకులు రాచర్ల బాలరాజు, జిల్లా నాయకులు సంపత్‌కుమార్ పాల్గొన్నారు.