వరంగల్ చౌరస్తా: రాష్ట్రంలో వైద్యానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నాం, భవిష్యత్తులో సైతం ఇస్తాం అని ఊకదంపుడు ముచ్చట్లు చెబుతున్న ప్రభుత్వం అందుకు అడుగులు మాత్రం వేయడం లేదు. వివరాల్లోకి వెళ్తే..ఎంజీఎం హాస్పిటల్లో చికిత్స చేయించుకోవడానికి ముందు తమ వివరాలను నమోదు చేసుకొని ఔట్ పేషెంట్ రిజిస్ట్రేషన్ చీటీ తీసుకోవాల్సి ఉంటుంది. అందులో రోగి బాధపడుతున్న సమస్యకు వైద్యం అందించగల విభాగం పేరు గది నంబరు నమోదు చేసి ఉంటుంది.
బుధవారం ఓపీ రిజిస్ట్రేషన్ కౌంటర్ లోని కంప్యూటర్ ప్రింటర్ పని చేయకపోవడంతో సిబ్బంది చేతి రాత రూపంలో వివరాలను తెల్ల పేపరు పై నమోదు చేసి ఇస్తున్నారు. కంప్యూటర్ ప్రింటర్ లోని క్యాట్రిడ్జ్ పని చేయడం లేదు. సుమారు 500 రూపాయలతో మరమ్మతులు చేస్తే సేవలు సాఫీగా సాగే అవకాశాలు ఉన్నా, వివరాల నమోదు ప్రక్రియలో ఇబ్బందులు తలెత్తుతున్న అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధిగవున్న మంత్రి కొండా సురేఖ సైతం స్పందించకపోవడం పై రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.