సంగెం, నవంబర్ 25 : మోసపూరిత వాగ్దానాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీని ఈ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. శనివారం మండలంలోని గుంటూరుపల్లి, కాపులకనపర్తి, ఆశాలపల్లి, రాంచంద్రాపురం, కోటవెంకటాపురం, కాట్రపల్లి, గవిచర్ల గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో జరిగిన రోడ్ షోలలో ఆయన మాట్లాడుతూ.. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను కాపాడుకోవాలంటే అబద్ధాల కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలన్నారు. కాంగ్రెస్ పార్టీకే గ్యారంటీ లేదని, అలాంటిది వారు చెప్పే ఆరు గ్యారెంటీలను ప్రజలు నమ్మరని చెప్పారు. మండలాన్ని అన్ని రంగాల్లో సీఎం కేసీఆర్ సహకారంతో అభివృద్ధి చేశానని, మూడోసారి కారు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సీఎం కేసీఆర్‌ను హ్యాట్రిక్ ముఖ్యమంత్రిని చేయాలన్నారు. 1,350 ఎకరాల్లో దేశంలోనే పెద్దదైన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో 50వేల మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. యువత, మహిళలకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తనదేనన్నారు. గృహలక్ష్మి ఇండ్లకు డబ్బులు ఇస్తామంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్‌కు ఇవ్వొద్దని లెటర్ ఇచ్చిందని, ఎన్నికలు అయిపోగానే ఇండ్లకు డబ్బులిప్పిస్తామని చెప్పారు. కాంగ్రెస్ కుట్ర రాజకీయం పటాపంచలు అయిందని, రైతు బంధుకు ఎన్నికల సంఘం లైన్‌క్లియర్ చేసిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ కృషి వల్ల రైతుబంధు పైసలు రైతుల అకౌంట్లలో పడతాయని చెప్పారు.
మండలంలోని కాపులకనపర్తికి చెందిన వెలమ కులానికి చెందిన 50 కుటుంబాలు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి తమ మద్దతు ప్రకటించాయి. ఈ మేరకు తీర్మానం చేసి ప్రతిని అధ్యక్షుడు దుగ్యా ల గోపాల్‌రావు, కార్యదర్శి పొలాల గోపాల్‌రావు, సభ్యులు దుగ్యా ల దేవేందర్‌రావు, తక్కళ్లపల్లి వెంకటేశ్వర్రావు, లింగారావు, పో లం రాజేశ్వర్‌రావు, ప్రసాదరావు, కమలాకర్‌రావు, రవీందర్‌రా వు, ప్రతాప్రావు, అజయ్, రాము అందజేశారు. కాగా, తనపై నమ్మకం, అభిమానంతో పూర్తి మద్దతు తెలిపిన వెలమ కులస్తులకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నిమ్మగడ్డ వెంకటేశ్వర్రావు, ఎంపీపీ కందకట్ల కళావతి, జడ్పీటీసీ గూడ సుదర్శన్‌రెడ్డి, సర్పంచ్‌లు మోతె రాజేశ్వరి, ఎర్రబెల్లి గోపాల్‌రావు, కిశోర్‌యాదవ్, బోంపెల్లి జయశ్రీ, పూజారి ఉమాదేవి, పులుగు సాగర్‌రెడ్డి, దొనికెల రమ, ఎంపీటీసీలు సుతారి బాలకృష్ణ, గాయపు ప్రచూర్ణ, నాయకులు రవికుమార్, కాలె కిషన్‌రావు, దోపతి సమ్మయ్య, జక్క మల్లయ్య, బర్ల యువరాజ్, కత్తి రమేశ్, మాజీ ఎంపీటీసీ దొనికెల శ్రీనివాస్, కరుణాకర్, దయాకర్, సొసైటీ చైర్మన్లు దొమ్మాటి సంపత్, కుమారస్వామియాదవ్ పాల్గొన్నారు.