భూపాలపల్లి కలెక్టర్ భవేశ్‌మిశ్రా
పట్టణ ప్రగతి పనుల పరిశీలన
నేటితో ముగియనున్న కార్యక్రమం
గ్రామసభల నిర్వహణకు సిద్ధం
కృష్ణకాలనీ, జూన్ 17 : పరిసరాల పరిశుభ్రతే పట్టణ ప్రగతి లక్ష్యమని జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. మున్సిపల్ పరిధిలోని 12, 13, 1వ వార్డులోని కాశీంపల్లి, సెగ్గంపల్లిలో జరిగే పట్టణ ప్రగతి పనులు పరిశీలించారు. ఇంటింటికీ వెళ్లి కాలనీవాసులతో మాట్లాడారు. కాశీంపల్లి పాఠశాలలో విద్యార్థుల హజరుపట్టిక పరిశీలించారు. అక్కడే ఉన్న వైద్యుడితో మాట్లాడుతూ.. పింఛన్ వస్తున్నదా? అని అడిగి తెలుసుకున్నారు. కాశీంపల్లి యూపీఎస్ అదనపు గదుల కోసం రూ. 25 లక్షల నిధులు విడుదల చేశారు. హెల్త్ సబ్ సెంటర్‌కు కావాల్సిన వసతులపై డీఎంహెచ్‌వోను అడిగి తెలుసుకున్నారు. సెగ్గంపల్లి అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి పౌఐష్టికాహార వివరాలు అడిగి తెలుసుకున్నారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణీ సిద్దు, వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, పీఏసీఎస్ చైర్మన్ మేకల సంపత్‌కుమార్ యాదవ్, 13వ వార్డు కౌన్సిలర్ మంగళపెల్లి తిరుపతి, హనుమాన్ టెంపుల్ డైరెక్టర్ పొనుగోటి రమేశ్, బండారి రవి, 12వ వార్డు అధ్యక్షుడు మేనం రాజేందర్, నాయకులు తాటి అశోక్‌గౌడ్, బొంతల సతీశ్, మాడ ప్రతాప్‌రెడ్డి, మారేళ్ల సేనాపతి, బండారి రవి, నలిగేటి సతీశ్ కుమారన్ యాదవ్, పొలవేణి అశోక్, రాజు, సల్ల శ్రీనివాస్, గండి చిరంజీవి, బేతు రమేశ్, శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, ఏఈ రోజారాణి, శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రశాంతి, టీపీవో అవినాశ్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, అంగన్వాడీ టీచర్లు, ఆశలు పాల్గొన్నారు.
ములుగు రూరల్ : ప్రకృతి వనాన్ని పరిశీలిస్తున్న డీఆర్వో
నేడు ‘పల్లె ప్రగతి’పై గ్రామసభ
మహదేవపూర్ : మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో పల్లె ప్రగతి పనులపై శనివారం గ్రామసభలు నిర్వహించనున్నట్లు మండల పంచాయతీ అధికారి ప్రసాద్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామాల్లో పంచాయతీ ఈ నెల 3 నుంచి 17 వ తేదీ వర కు చేపట్టిన పల్లెప్రగతి పనులపై గ్రామసభలో చర్చించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
పల్లెప్రగతిపై సమీక్ష
కాటారం: మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో పల్లెప్రగతి పనులపై పంచాయతీ కార్యదర్శులతో ఎంపీడీవో ఆంజనేయులు సమీక్షించారు. శనివారం గ్రామసభలు నిర్వహించి చేసిన పనులను ప్రజలకు వివరించాలని వారికి సూచించారు. కార్యక్రమంలో ఎంపీవో మల్లికార్జున్‌రెడ్డి, ఏపీవో వెంకన్న, కార్యదర్శులు పాల్గొన్నారు.
మొక్కలు నాటిన సర్పంచ్
మహదేవపూర్: పల్లెప్రగతిలో భాగంగా బొమ్మాపూర్ క్రాస్ వద్ద ప్రధాన రహదారికి ఇరువైపులా సర్పంచ్ శ్రీపతిబాపు ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఆర్ఐ సౌభాగ్యవతి, పంచాయతీ కార్యదర్శి రజనీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.
పల్లెప్రగతి పనుల పరిశీలన
మహదేవపూర్(పలిమెల): పలిమెల మండలంలో జరుగుతున్న పల్లెప్రగతి పనులను జయశంకర్ భూపాలపల్లి జిల్లా సీఈవో శోభారాణి, మండల ప్రత్యేక అధికారి, మత్శ్య శాఖ జిల్లా అధికారి అవినాశ్ పరిశీలించారు. పలు గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాలను, పల్లెప్రకృతి వనాలను సందర్శించారు. కార్యక్రమంలో ఎంపీడీవో ప్రకాశ్‌రెడ్డి, సర్పంచ్ పుష్పలత, ఏపీవో రమేశ్ పాల్గొన్నారు.
కొనసాగుతున్న పనులు
భూపాలపల్లి రూరల్: భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డు సుభాశ్‌కాలనీ, 22వ వార్డు లక్ష్మీనగర్‌లో జరుగుతున్న పట్టణ ప్రగతి పనులను కౌన్సిలర్లు ముంజాల రవీందర్ గౌడ్, ముంజంపెల్లి మురళీధర్ శుక్రవారం పరిశీలించారు. లక్ష్మీనగర్ లోని గణేశ్‌చౌక్ పరిసర ప్రాంతాల్లో చెత్త, చెదారం, పిచ్చి మొక్కలను సిబ్బంది తొలగించారు. సుభాష్‌కాలనీ రాయాలయం ఎదుట ఉన్న పరిసర ప్రాంతాల్లో పిచ్చి మొక్కలు, వ్యర్థ పదార్థాలను తొలగించారు. కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
పల్లెల్లో పరిశుభ్రత పాటించాలి
చిట్యాల: పల్లెలో పరిశుభ్రతను పెంచి గ్రామాల్లో నీరు నిల్వకుండా చూడాలని మండల స్పెషల్ ఆఫీసర్ శైలజ అన్నారు. పల్లెప్రగతిలో భాగంగా ఎంపీడీవో రామయ్యతో కలిసి గుంటూరుపల్లిని సందర్శించారు. పల్లెప్రగతిలో జరిగిన అభివృద్ధి పనులు, చేపట్టాల్సిన పనులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..వర్షకాలంలో గ్రామంలో ఎక్కడా నీరు నిల్వకుండా చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ రాణీవెంకటేశ్వర్లు, పంచాయతీకార్యదిర్శి మహేశ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
పల్లె ప్రగతి పరిశీలన
ములుగురూరల్: మండలంలోని దేవగిరిపట్నం, పత్తిపల్లి గ్రామాల్లో చేపడుతున్న పల్లె ప్రగతి పనులను డీఆర్వో కూతాటి రమాదేవి శుక్రవారం పరిశీలించారు. రోజు వారిగా చేపట్టిన కార్యక్రమాలను అడిగి తెలుసుకోవడంతో పాటు పలు కాలనీలను పరిశీలించారు. ఆమె వెంట తహసీల్దార్ మధురకవి సత్యనారాయణస్వామి, ఎంపీడీవో ఇక్బాల్‌హుస్సేన్, ఎంపీవో హన్మంతరావు, గ్రామ కార్యదర్శులు తదితరులు ఉన్నారు.