దుగ్గొండి, మే, 7: ఆయిల్ ఫామ్ సాగుతో రైతులు లాభాలను పొందవచ్చని ఉద్యానవన శాఖ అధికారి పల్లకొండ జ్యోతి పేర్కొన్నారు. బుధవారం మండలంలోని పోనకల్ గ్రామంలోని బుసారి బాబురావు ఆయిల్ ఫామ్ సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తోటలో అంతర్ పంటలుగా తీగజాతి పంటలను వేసుకోవచ్చని, డ్రిప్ పద్ధతిలో నీటిని పొదుపుగా వాడి అధిక దిగుబడును పొందవచ్చన్నారు.
గెలలను ముగి పురుగు, చీడపీడల నివారణ, గెలల నాణ్యతకు జింకు, బోరాన్, మెగ్నీషియం, లాంటి పోషకాలను మొక్కలకు అందించాలని రైతులకు వివరించారు. మార్కెటింగ్ సదుపాయాన్ని గురించి రైతులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆయిల్ ఫామ్ ఫీల్డ్ ఆఫీసర్ బి. అనిల్, జైన్ కంపెనీ ప్రతినిధులు రాజమౌళి, శ్రీనాథ్, రైతులు బాబురావు, జైపాల్ రెడ్డి, బాల మోహన్, రాజేందర్, లక్ష్మీపురం రైతులు తదితరులు పాల్గొన్నారు.