ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్ని అడ్డంకులను అధిగమించి దేవాదుల ఫేజ్-3 పనులు పూర్తి చేసేందుకు రూ.1,450కోట్ల నిధులు కేటాయించి పనులు చేశారని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. రామప్ప నుంచి దేవన్నపేట పంప్‌హౌస్ వరకు టెన్నెల్ పనులు పూర్తి చేసినప్పటికీ మోటర్లు ఆన్ చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి అవగహన లేక సకాలంలో మోటర్లు నడవక స్టేషన్‌ఘన్‌పూర్, పాలకుర్తి, జనగామ జిల్లాలోని తపాస్‌పల్లి ప్రాంతాల్లో 50శాతం పంటలు ఎండిపోయి రూ.600 కోట్ల మేర నష్టం జరిగిందన్నారు.
నీటి పారుదల శాఖ మంత్రి పంప్‌హౌస్ వద్దకు వచ్చి ఏ రాత్రయినా మోటర్లు ఆన్ చేసిన ఇక్కడినుంచి వెళ్తామని చెప్పి వెనుదిరిగారని.. కానీ ఇప్పటి ఎన్ని రాత్రులు గడిచాయో ఆయన గుర్తుంచుకోవాలన్నారు. చేతకాని, చేవలేని దద్దమ్మ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని పల్లా ధ్వజమెత్తారు. కనీసం ఓఎండీకి రూ.6 కోట్లు నిధులు కేటాయించకపోడం వల్ల 34రోజులు ధర్నా చేస్తే అధికారంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా మాట్లడకపోవడం దురదుష్టకరమన్నారు.
స్వయంగా తాను ఎస్ఈ, డీఈలతో మాట్లాడి నిధులు ఇప్పించానని పల్లా గుర్తుచేశారు. గోదావరి ఇన్‌టెక్ వద్ద సంవృద్ధిగా నీళ్లు ఉన్నప్పటికీ సరైన సమయంలో మోటర్లు ఆన్ చేయక పంటలు ఎండిపోయాయని మండిపడ్డారు. ఇప్పటికైనా వెంటనే మోటర్లు ఆన్ చేసి నీళ్లు ఇవ్వాలని ఈ ప్రాజెక్టుపై అవగాహన తెచ్చుకొని పంపులను ఆన్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకుడు రాకేశ్‌రెడ్డి, ధర్మసాగర్ పీఏసీఎస్ చైర్మన్ రాజేశ్వర్‌రెడ్డి, నాగుర్ల వెంకటేశ్వర్లు, నిమ్మగడ్డ వెంకన్న, కర్ర సొమిరెడ్డి, రాజేశ్వర్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, నర్సింగరావు, మాజీ కార్పొరేటర్ యాదగిరి, రాజునాయక్, లాల్ మహ్మద్, రంజిత్, తదితరులు ఉన్నారు.