ఎల్కతుర్తి, ఏప్రిల్ 18 : భారీ సభలకు పెట్టింది పేరు బీఆర్ఎస్ అని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. ఎల్కతుర్తిలోని భారీ బహిరంగ సభ ఏర్పాట్లను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ దేశ చరిత్రలో అద్భుతమైన సభలు నిర్వహించిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీదన్నారు. బీఆర్ఎస్ పార్టీ 25 వసంతాల్లో అడుగు పెడుతున్న సందర్భంగా ఈ నెల 27న నిర్వహించనున్న రజతోత్సవ సభ దేశ చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ప్రజలందరు కూర్చోడానికి సీట్లు, మహిళలకు టాయ్‌లెట్స్, లక్షల మజ్జిగ, వాటర్ ప్యా కెట్లు సిద్ధంగా ఉంచుతున్నామన్నారు. నియోజకవర్గాల వా రీగా వాహనాల పార్కింగ్‌కు గూగుల్ పాయింట్ల ను సైతం అందించనున్నట్లు వివరించారు.
పోరాడి సాధించుకున్న తెలంగాణను 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ అద్భుతంగా తీర్చిదిద్ది అభివృద్ధి చేస్తే, అలవికాని హామీలతో గద్దె నెక్కిన రేవంత్‌రెడ్డి సర్కారు 16 నెలల్లో తెలంగాణను మళ్లీ తెర్లు చేస్తుందని పేర్కొన్నారు. పండిన పంటను కొనే తెలివి లేదని, కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయకపోవడం బాధాకరమన్నారు. ఇప్పుడు 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం వ స్తుందని చెప్తున్నారని, అది మీరు చేసింది కాద ని గుర్తుంచుకోవాలని సూచించారు. 2014 లో 24లక్షల మెట్రిక్ టన్నులు పండితే, 2023 తాము దిగిపోయే వరకే దాన్ని 141లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించి ఎఫ్‌సీఐకి అందించామని, మరో కోటి 60 లక్షల మెట్రిక్ టన్నులు తినడానికి, ఇతర అవసరాలకు అందించిన ఘన త కేసీఆర్‌ది అన్నారు. కేసీఆర్ 46 వేల చెరువులకు మరమ్మతులు చేసి, రిజర్వాయర్లు కడితే సాధ్యమైందన్నారు.
అంతేకాకుండా రూ. 72 వేల కోట్లను రైతుబంధు కింద అందించామని, లక్షా 50వేల మందికి రైతుబీమా అందించి రైతులను ఆదుకున్నామని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని నడిపి రాష్ర్టాన్ని సాధించి విజయతీరాలను ముద్దాడిన పార్టీ బీఆర్ఎస్ అని, మళ్లీ ఇప్పుడు కేసీఆరే రావాలని ప్రజలంతా కోరుకుంటున్నారని తెలిపారు. కేసీఆర్ మాట విని మళ్లీ స్ఫూర్తి పొందాలని ప్రజలంతా ఈ సభ కోసం ఎదురు చూస్తున్నారని, సభకు వాహనాలు సమకూర్చితే తామే స్వచ్ఛందంగా వస్తామని చెప్తున్నారని పేర్కొన్నారు.
సభకు వచ్చే ప్రజలు ముందుగానే 4గంటల వరకు చేరుకోవాలని కోరారు. కార్యక్రమంలో హనుమకొండ జడ్పీ మాజీ చైర్మన్ మారెపల్లి సుధీర్‌కుమార్, వరంగల్ వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ చింతం సదానందం, గ్రౌండ్ ఇన్చార్జిలు భర త్కుమార్రెడ్డి, వెంకన్న, నాయకులు ఎల్తూరి స్వామి, పోరెడ్డి రవీందర్‌రెడ్డి, వేముల శ్రీనివాస్, రాజేశ్వర్‌రావు, కొమ్మిడి మహిపాల్‌రెడ్డి, దుగ్యాని సమ్మయ్య, చిట్టిగౌడ్, భగవాన్ పాల్గొన్నారు.