బయ్యారం, ఏప్రిల్ 9 : చివరి దశలో యాసంగి పంటలు ఎండుతున్నాయి. ఇంకో తడిపెడితే పంట చేతికొచ్చేదని అన్నదాతలు ఆందోళన చెందుతున్నా రు. చివరి తడికి పడరాని పాట్లు పడుతున్నారు. బయ్యారం మండలం జగ్గుతండా, బంజార తండాతోపాటు సరిహద్దు కురవి మండలం గుండ్రాతి మ డుగుకు చెందిన సుమారు 50 మంది సుమారు 200 ఎకరాల్లో పాకాల ఏరు నీరు ఆధారంగా యా సంగిలో వరి, మక్కజొన్న, మినుములు, పెసర వం టి పంటలు సాగు చేశారు.
ఇందులో ఎక్కువ శాతం వరి పంట ఉన్నది. ఏటిలో ఉన్న అరకొర నీటితో కొన్ని నెలలుగా పంటలను కాపాడుకోవడంతో చివ రి దశకు చేరుకున్నాయి. పొట్ట దశలో ఉన్న ఇంకో నెల రోజులైతే చేతికొస్తుంది. ఈ క్రమంలో ఎండల తీవ్రత పెరగడం.., ఏటిలో నీరు పూర్తిగా అడుగంటి రాళ్లురప్పలు తేలడంతో రైతులకు సాగునీటి కష్టాలు మొదలయ్యాయి. ఎలాగైనా పంటను కాపాడుకోవాలని రైతులు నీటి కోసం భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. ఏటిలోనే చెలిమెలు (గుంటలు) తీసి, వచ్చి న ఊట నీటిని మోటర్లతో వరి పంటలకు మళ్లించి కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. అయినా, నీరు సరిపోక కొన్నిచోట్ల పంట ఎండుతున్నది. ఇంకో వారం రోజులు ఇలా గే ఉంటే, పంటలు పూర్తిగా ఎండిపోతాయని, అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేద ని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పెట్టుబడి కోసం ఎకరాకు ఇప్పటికే రూ.30వేల వరకు ఖర్చు పెట్టామని, పంటలు ఎండిపోతే తె చ్చిన అప్పులు ఎలా తీర్చాలని ఆ యకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. తాళ్లపూసపల్లి చెరువుకు చేరుకునే శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ (కాళేశ్వరం) నీటిని మత్తడి ద్వారా మరోమారు పాకాల ఏటికి మళ్లిం చి నీరందేలా చూడాలని రైతులు కోరుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సాగునీటి విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించడంతో యాసంగిలోనూ పుష్కలంగా సాగునీరు అందేదని రైతులు గుర్తు చేసుకుంటున్నారు.
పాకాల ఏరులో నీరు అడుగంటి చివరి తడికి ఇబ్బంది పడుతున్నాం. పాకాల ఏరు నీరు ఆధారంగానే యాసంగిలో వరి, మక్కజొన్న పంటలు సాగు చేశాం. వేసవి కావడంతో ఏరు పూర్తిగా ఎండిపోయింది. చెలిమెలు తీసి ఊట నీటిని మోటర్లతో పంటలకు మళ్లించి పొట్టకొచ్చిన పంటను కాపాడుకుంటున్నాం. ఇప్పటికే వేల రూపాయల పెట్టుబడి పెట్టినం. పంట చేతికొస్తుందో.. లేదోనని భయంగా ఉంది. ఎస్సారెస్పీ నీటిని వదిలి పంటలను కాపాడాలి. – రాములు, రైతు, జగ్గుతండా