SIR Enumeration | ‘సర్’ నమోదుపై ముస్లింల అలర్ట్.. ఓట్ల తొలగింపుపై అనుమానాలు
SIR Enumeration | ‘సర్' నమోదు ప్రక్రియలో భాగంగా రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత కీలకమైన ముస్లిం మైనారిటీ ఓటర్లు అప్రమత్తమయ్యారు. తమ ఓట్లను రాజకీయ ప్రత్యర్థులు లేదా అధికార యంత్రాంగం ఎకడైనా తొలగిస్తుందనే భయాల నేపథ్యంలో తమ ఓటు హకును కాపాడుకొనేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు.
SIR Enumeration | హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ): ‘సర్’ నమోదు ప్రక్రియలో భాగంగా రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత కీలకమైన ముస్లిం మైనారిటీ ఓటర్లు అప్రమత్తమయ్యారు. తమ ఓట్లను రాజకీయ ప్రత్యర్థులు లేదా అధికార యంత్రాంగం ఎకడైనా తొలగిస్తుందనే భయాల నేపథ్యంలో తమ ఓటు హకును కాపాడుకొనేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ పాతబస్తీ సహా ముస్లిం జనా భా ఎకువగా ఉన్న జిల్లాల్లో మసీద్ కమిటీలు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ‘సర్’ ప్రక్రియ వేగంగా సాగుతున్నది.
గెలుపోటముల్లో వీరి ఓట్లు కీలకం
రాష్ట్రంలో ముస్లింల జనాభా 45లక్షలు ఉండగా ఓటర్ల సంఖ్య 30నుంచి 32లక్షల వరకు ఉంటుందని అంచనా. రాష్ట్ర జనాభాలో 12.75% ఉన్న ముస్లింల ప్రాతిని ధ్యం హైదరాబాద్ సహా ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో చాలా బలంగా ఉన్నది. రాజకీయంగా పరిశీలిస్తే ముస్లిం ఓట్ల సరళి అంతా పాతబస్తీ చుట్టూనే తిరుగుతుంది. అదేస్థాయిలో జిల్లాల్లో కూడా వీరికి 15 నుంచి 35% ఓటు బ్యాంకు ఉన్నది. 30కి పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రధాన రాజకీయ పార్టీల జాతకాలను ప్రభావితం చేస్తున్నారు. ఆయాచోట్ల ఏకపక్షంగా ముస్లిం ఎమ్మెల్యేలు గెలువకపోయినా, వారు ఎటువైపు మొగ్గుచూపితే ఆ పార్టీ అభ్యర్థి విజయం ఖాయమవుతుంది. అందుకే ఈ రెండో ప్రాధాన్యత కలిగిన నియోజకవర్గాల్లో ఓట్ల నమోదుపై ముస్లిం సమాజం ఈసారి గట్టిగానే ఫోకస్ పెట్టింది.
ఏయే నియోజకవర్గాల్లో ఎంతంటే?
- వరంగల్ ఈస్ట్లో 22% ఓట్లతో బలమైన శక్తి ఉన్నారు.
- నల్లగొండ టౌన్, మిర్యాలగూడ నియోజకవర్గంలో 12-15% ఓట్లు ఉన్నాయి. పోటీ తీవ్రంగా ఉన్నప్పుడు విజేతను నిర్ణయిస్తాయ.
- ఖమ్మం పట్టణ పరిధిలో దాదాపు 15% ఓటర్లు ఉన్నారు.
- కరీంనగర్ టౌన్, కరీంనగర్ అర్బన్, జగిత్యాలలో దాదాపు 20% ముస్లిం ఓట్లు కీలకంగా మారుతుంటాయి.
- ఇక హైదరాబాద్ పాతబస్తీలో ఏడు స్థానాలు ఏకపక్షంగా ఒకే పార్టీ వైపు వెళ్లే అవకాశం ఎకువ ఉంటుంది. కానీ పైన పేరొన్న రెండో ప్రాధాన్యత గల 20 నుంచి 25 నియోజకవర్గాల్లో ముస్లిం ఓట్లు కాంగ్రెస్, బీఆర్ఎస్, ఇత ర సెక్యులర్ పార్టీల మధ్య చీలిపోతుంటాయి. అందుకే, ఈ జిల్లాల్లో తమ ఓట్లు ఎకడా డిలీట్ కాకుండా చూసుకోవడానికి స్థానిక ముస్లిం యువత, కమిటీలు గ్రామీణ, పట్టణ స్థాయిల్లో మరింత గట్టిగా శ్రమిస్తున్నాయి.
ఓట్ల కోసం క్షేత్రస్థాయి వ్యూహం
తమ ఓట్లు గంపగుత్తగా తొలగిస్తారనే అనుమానాల నేపథ్యంలో ముస్లిం సమా జం సాంకేతికతను, స్థానిక నెట్వర్ను పకాగా వినియోగిస్తున్నది. ప్రతి శుక్రవా రం నమాజ్ సందర్భంగా మసీద్ కమిటీలు మైకుల ద్వారా ఓట్ల నమోదు ప్రాధాన్యత ను వివరిస్తున్నాయి. ప్రతి పెద్ద మసీదు వెలుపల ‘ఓటర్ హెల్ప్ డెస్” కౌంటర్లను ఏర్పాటు చేశారు. ముస్లింలు ‘సర్’లో భారీ గా నమోదు చేసుకోవడం వెనుక ఎంఐఎం పార్టీ ఉన్నదని మొదట ఊహాగానాలు వచ్చినా కానీ ముస్లిం సమాజమే స్వతహాగా రంగంలోకి దిగినట్టు తెలుస్తున్నది.
రాష్ట్రంలో ముస్లింల ప్రాతినిధ్యం ఎకువగా ఉన్న ప్రధాన జిల్లాల వివరాలు
జిల్లా మొత్తం జనాభాలో ముస్లింల శాతం కీలక ప్రభావం చూపే నియోజకవర్గాలు
- హైదరాబాద్ 43.45%(చార్మినార్, చాంద్రాయణగుట్ట,బహదూర్ పురా, మలక్ పేట్, కార్వాన్,యాకుత్పురా, నాంపల్లి)
- నిజామాబాద్ 18.52% (నిజామాబాద్ అర్బన్, బోధన్)
- సంగారెడ్డి 16.15% (సంగారెడ్డి, జహీరాబాద్)
- నిర్మల్ 14.04% (భైంసా, నిర్మల్)
- రంగారెడ్డి 13.62% (రాజేంద్రనగర్, మహేశ్వరం,
- శేరిలింగంపల్లి పరిసర ప్రాంతాలు)
- వికారాబాద్ 12.94% (పరిగి, తాండూరు)
- ఆదిలాబాద్ 12.58% (ఆదిలాబాద్ టౌన్)
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

