ఘనంగా కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు వేడుకలను ఉమ్మడి నల్లగొండ జిల్లాలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. నకిరేకట్లోని మెయిన్ సెంటర్లో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు.
యాదాద్రి భువనగిరి, జూలై 24 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు వేడుకలను ఉమ్మడి నల్లగొండ జిల్లాలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. నకిరేకట్లోని మెయిన్ సెంటర్లో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. తెలంగాణలో ఐటీ రంగాన్ని, పారిశ్రామిక ప్రగతిని అభివృద్ధి చేసిన ఘనత కేటీఆర్‌దే అని, కేటీఆర్ లాంటి మహానాయకుడు దేశానికి అవసరమని, ఆయన నిండునూరెండ్లు ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో కొనసాగాలని ఆకాక్షించారు.
నార్కట్‌పల్లి బస్టాండ్ ఆవరణలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. దేవరకొండలో కేక్ కట్ చేసిన అనంతరం ప్రభుత్వ దవాఖానలో బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ రోగులకు పండ్లు పంపిణీ చేశారు. నిడమనూరులో మాజీ ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో ట్రైకార్ మాజీ చైర్మన్ ఇస్లావత్ రాంచందర్ నాయక్‌తో కలిసి మొక్కలు నాటారు. సూర్యాపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి కేటీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

నకిరేకల్ మెయిన్ సెంటర్లో కేక్ కట్ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

నార్కట్‌పల్లి బస్టాండ్ ఆవరణలో మాజీ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్బంగా కేక్ కట్ చేస్తున్న దృశ్యం

సూర్యాపేటలో కేక్ కట్ చేస్తున్న బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు బీఆర్ఎస్ శ్రేణులు

నిడమనూరులో మొక్క నాటుతున్న మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Puneeth Rajkumar: గంటన్నర పాటు కిక్ బాక్సింగ్.. పునీత్ రాజ్‌కుమార్ చివరి క్షణాలు గురించి చెప్పిన డాక్టర్
‘పేదింటి ఆడబిడ్డల పెళ్లికి భరోసా కల్యాణలక్ష్మి’
వైటీపీఎస్ స్టేజ్ -1 చీఫ్ ఇంజినీర్ సురేష్ నాయక్ సస్పెన్షన్
Vijay Deverakonda | ‘రణబాలి’ విడుదల వేళ పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న!
Jobs | యూకో బ్యాంక్‌లో 530 అప్రెంటిస్ ఖాళీలు.. అక్టోబర్ 29 చివరితేదీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

