కాజీపేట: హనుమకొండ జిల్లా కాజీపేట మండలంలోని అన్ని గ్రామాలలో అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవా లని సిపిఎం పార్టీ నాయకుడు ఓరుగంటి సాంబయ్య డిమాండ్ చేశారు. సోమవారం పార్టీ మండల ప్రతినిధి బృందం మండలంలోని పలు గ్రామాలలో అకాల వర్షాలకు దెబ్బ తిన్న పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా సాంబయ్య మాట్లాడుతూ కాజీపేట మండలంలోని దర్గా కాజీపేటతో పాటు చాలా గ్రామాలలో రికార్డ్ స్థాయిలో కురిసిన భారీ వర్షాలకు పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు.
ప్రభుత్వం గ్రామాలలో సర్వే చేసి వరి రైతులకు ఎకరాకు 80 వేలు, మొక్కజొన్న రైతుకు 70 వేలు, పత్తి రైతుకు ఎకరాకు లక్ష రూపాయల చొప్పున నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆరుగాలం కష్టపడి ఈ దేశానికి తిండి పెడు తున్న రైతన్నలకు ఈ ఆపద సమయంలో ప్రభుత్వం ఆదుకొని వారికి అండగా నిలవాలని, లేదంటే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడుతామని హెచ్చరించాలి. ఈ కార్యక్ర మంలో పార్టీ మండల నాయకులు జంపాల రమేష్, చంటి రవి, అక్కిలి కట్టయ్య, నాగరాజు పాల్గొన్నారు.