హనుమకొండ చౌరస్తా : ఈనెల 20న ఓబీసీల ఓరుగల్లు పోరుబాట (Orugallu Porubata) పుస్తక సమీక్ష సదస్సును నిర్వహిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు ( Vannala Sriramulu ) తెలిపారు. శుక్రవారం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రజారోగ్య, సాంకేతిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, సీనియర్ ఐఏఎస్ అధికారి పరికిపండ్ల నరహరి, ప్రముఖ న్యాయవాది పృథ్వీరాజ్ సింగ్ సంయుక్తంగా రచించిన ఓబీసీల ఓరుగల్లు పోరుబాట ది వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ బోర్డు సౌజన్యంతో జన అధికార సమితి ఏర్పాటు చేసిందన్నారు. స్వాతంత్య్రం సిద్ధించినప్పటి నుంచి ఓబీసీలకు రిజర్వేషన్ల ప్రక్రియలో జరుగుతున్న అన్యాయాలను, హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాల పనితీరును ఎండగడుతూ పుస్తకంలోని అంశాలను ప్రతి బీసీ వంటపట్టించుకోవాలని సూచించారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజాపరిషత్ మాజీ చైర్మన్, ది వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ బోర్డు వర్కింగ్ ప్రెసిడెంట్ సాంబారి సమ్మారావు, వ్యాక్ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ వన్నాల వెంకటరమణ, జన అధికార సమితి రాజకీయ విశ్లేషకులు తిరునగరి శేషు, బీసీ ఇంటిలెక్చువల్స్ ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కూరపాటి రమేష్ , గౌరవ సలహాదారులు వేముల సదానందం, జన అధికార సమితి ప్రతినిధి సంపత్, నాయిబ్రాహ్మణ సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు నాగవెళ్లి సురేష్‌కుమార్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.