హనుమకొండ, అక్టోబర్ 21: ఈనెల 26న హనుమకొండలోని కాళోజీ కళాక్షేతం వేదికగా ఉదయం 11 నుంచి రాత్రి 7 గంటలకు ఓరుగల్లు గాన కళావైభవం నిర్వహిస్తున్నట్లు ప్రొఫెసర్ వి.తిరుపతయ్య, ప్రజావాగ్గేయకుడు మైస ఎరన్న తెలిపారు. మంగళవారం హనుమకొండ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన సమావేశంలో పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 40 మంది రచయిత్రల పాటలు చూడకుండా 5 గంటలు నిర్వీరామంగా 100 పాటలు ఎరన్న పాడనున్నట్లు తెలిపారు.
కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొని ప్రారంభిస్తారని, కళాకారులు, కళాభిమానులు అధికసంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిట్టవరం శ్రీమన్నారాయణ, కవి సిరాజుద్దీన్, నల్ల లక్ష్మీనారాయణ, కండికట్ల విజయకుమార్, జూపాక శివ, మైస ఏలియా పాల్గొన్నారు.