హనుమకొండ, నవంబర్ 2: సేంద్రియ ఉత్పత్తులు ఆరోగ్యానికి ఎంతోమంచిందని, ప్రతిఒక్కరూ సేంద్రియ ఉత్పత్తులనే ఆదరించాలని మిల్లెట్ ప్రమోటర్స్నిమ్మల శ్రీనివాస్, భయ్యా సారయ్య అన్నారు. హనుమకొండ పబ్లిక్ గార్డెన్లోని నేరెళ్ల వేణుమాధవ్ కళాప్రాంగణంలో రెండురోజులు నేచురల్, సేంద్రియ రైతుల సంత కోలాహలంగా జరిగింది. నగర ప్రజలు స్టాళ్లను సందర్శించి కొనుగోలు చేశారు.
30 విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రతినెల రెండురోజులు ఇదే ప్రాంగణంలో సంత నిర్వహణకు సన్నాహాలు జరుగుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో మహిళా రైతు చిన్నాల అనిత, తదితరులు పాల్గొన్నారు.