హనుమకొండ, అక్టోబర్ 14: జాతీయ సాంకేతిక విద్యాసంస్థ (నిట్)లోని కంప్యూటర్ సైన్స్అండ్ ఇంజినీరింగ్ (సీఎస్ఈ) విభాగం ఆధ్వర్యంలో ‘స్మార్ట్ సిస్టమ్ డెవలప్మెంట్ కోసం నెక్ట్స్-జెన్ కంప్యూటింగ్ ఆప్టిమైజేషన్’ అనే అంశంపై ఆరు రోజుల ఆన్లైన్ ఏఐసీటీఈ ట్రైనింగ్ అండ్ లెర్నింగ్ (ఏటీఏఎల్) ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం(ఎఫ్డీపీ) నిర్వహించారు. ఈ ఆన్లైన్ ఎఫ్‌డిపి న్యూఢిల్లీలోని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) ఆధ్వర్యంలో18 వరకు జరగనున్నట్లు నిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ బిద్యాధర్ సుబుది తెలిపారు. పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డీ) డీన్ ప్రొఫెసర్ శిరీష్ హరి సోనవాణే, సిఎస్ఈ విభాగాధిపతి ప్రొఫెసర్ రష్మీ రంజన్రౌత్ పాల్గొని ఆధునిక కంప్యూటింగ్‌లో ఆప్టిమైజేషన్ సాంకేతికతల ప్రాముఖ్యతను వివరించారు.
ఈఎఫ్డీపీ సమన్వయకర్తలుగా సీఎస్ఈ విభాగం అధ్యాపకులు ప్రొఫెసర్ మంజుబాలా బీసీ, ప్రొఫెసర్ సంజయకుమార్ పాండా వ్యవహరించారు. ఈఎఫ్డీపీ ఉద్దేశం ఆప్టిమైజేషన్ ఆల్గోరిథమ్స్, నెక్ట్స్-జెనరేషన్ కంప్యూటింగ్, వాటి స్మార్ట్ సిస్టమ్‌లలోని అన్వయాలపై లోతైన అవగాహన కల్పించడమని వివరించారు. ఐఐటీ గువాహటి, నిట్ రూర్కెలా, ఓఎన్ జిసి దెహ్రాదూన్, సామ్సంగ్ ఎలక్ట్రో-మెకానిక్స్ బెంగళూరు, ఎక్సాన్ మొబిల్ బెంగళూరు, కార్డిఫ్ మెట్రోపాలిటన్ యూనివర్సిటీ (యుకె), సావోనియా యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ సైన్సెస్ (ఫిన్లాండ్), వాలియో చెన్నై వంటి ప్రఖ్యాత విద్యాసంస్థలు, పరిశ్రమల నిపుణులు వారంతా ఇంటరాక్టివ్ సెషన్లను నిర్వహించనున్నారు.
18న పరీక్ష, ఫీడ్‌బ్యాక్ సెషన్‌తో ముగుస్తుంది. స్మార్ట్సిస్టమ్ అభివృద్ధికి అవసరమైన నెక్ట్స్-జెన్ కంప్యూటింగ్ ఫ్రేమ్‌వర్క్‌లలో ఆప్టిమైజేషన్ సాంకేతికతలను అన్వయించడం ద్వారా అధ్యాపకులు, వృత్తి నిపుణుల పరిశోధనా, బోధనా సామర్థ్యాలను పెంపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుధి తెలిపారు.