సిటీబ్యూరో, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): ఆన్లైన్ వాహన ఆధారిత సేవలు అందించే యాప్ డ్రైవర్లకు కనీస ఛార్జీలు రూపొందించాలని డిమాండ్ చేస్తూ ర్యాపిడో, ఓలా, ఉబర్ తదితర యాప్ డ్రైవర్లు శనివారం దేశవ్యాప్తంగా బంద్ పాటించనున్నారు.
హైదరాబాద్‌లోనూ యాప్ డ్రైవర్లు బంద్‌లో పాల్గొంటున్నట్టు గిగ్ వర్కర్స్ యూనియన్, తెలంగాణ క్యాబ్ అసోసియేషన్ సంఘాలు తెలిపాయి. యాప్ డ్రైవర్లకు కనీస ఛార్జీలు రూపొందించాలని డిమాండ్ చేశారు.