పెద్దవంగర/రాయపర్తి, ఆగస్టు 29 : స్థానిక సం స్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు సైనికు ల్లా పనిచేయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో, వరంగల్ జిల్లా రాయపర్తి మండ లం ఊకల్ గ్రామంలో ముఖ్యనాయకులతో నిర్వహించిన విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మా ట్లాడారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ నిరుపేదలు, రైతుల అభివృద్ధికి అమలు చేసిన సంక్షేమ ప థకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును ఎండగట్టాలన్నారు.
స్థానిక ఎన్నికల్లో ప్రతి ఓటరు ఎంతో ముఖ్యమని, ఓటరు జాబితా రూపకల్పనలో ప్రభుత్వం అక్రమాలకు పా ల్పడే అవకాశముందని, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఓటర్ల జాబితాలో అభ్యంతరాలుం టే వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న అధికార కాంగ్రెస్ పార్టీకి స్థానిక ఎన్నికల్లో ఎదురుగాలి తప్పదన్నారు. గ్రామాల్లో ప్రతి ఇంటికి వెళ్లి కేసీఆర్ చేసిన పనులను వివరిస్తూ బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులకే ఓటు వేసేలా ప్రజలను చైతన్యం పర్చాలన్నారు.
రాయపర్తి మండలం ఊకల్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు లెక్కల ఉపేందర్‌రెడ్డి, దామరశెట్టి యాకయ్య, దీకొండ నరహరి, బండపల్లి యాకయ్య, అడ్లూరి సత్యనారాయణ, వెంకన్న, రాజు, రమేశ్ బీఆర్ఎస్లో చేరగా, వారికి ఎర్రబెల్లి కండువాలు పార్టీలోకి ఆహ్వానించారు. పెద్దవంగరలో మండల అధ్యక్ష, కార్యదర్శులు ఐలయ్య, సంజయ్, మండల మాజీ అధ్యక్షుడు సోమనర్సింహారెడ్డి, దేవస్థాన మాజీ చైర్మన్ రామచంద్రశర్మ, రాయపర్తిలో మండల నాయకులు జినుగు అనిమిరెడ్డి,రంగుకుమార్,కుందూరు రాంచంద్రారెడ్డి, రాంబాబు పాల్గొన్నారు.