జనగామ చౌరస్తా, జూన్ 7 : వడదెబ్బతో ఒకరు మృతిచెందిన ఘటన జనగామ జిల్లా కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. బీరప్పగడ్డ ప్రాంతానికి చెందిన నేతి అంతయ్య (70) లారీ ట్రాన్స్పోర్ట్ కార్యాలయంలో దినసరి కూలీగా పని చేస్తున్నాడు.
రోజువారీ పనులు ముగించుకొని ఇంటికి వచ్చిన అంతయ్య తీవ్ర అస్వస్థతకు గురై కుప్పకూలిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ప్రభుత్వ జనరల్ వైద్యశాలకు తరలించారు. అప్పటికే అంతయ్య మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అంతయ్యకు భార్యతోపాటు కుమారుడు, కుమార్తె ఉన్నారు.