నెక్కొండ, ఫిబ్రవరి 9 : రాష్ట్రం ఏర్పడక ముందు జరిగిన నష్టం కంటే తెలంగాణ ప్రాజెక్టులను అప్పనంగా కేంద్రానికి అప్పగించడంతో భారీ నష్టం వాటిల్లుతున్నదని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. నెక్కొండ ఆర్అండ్బీ అతిథి గృహంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పెద్ది మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ సర్కారు ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించలేదన్నారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పది రోజుల్లోనే కేంద్రానికి కేఆర్ఎంబీని అప్పగించిందన్నారు. గోదావరి రివర్స్ మేనేజ్మెంట్ను అప్పగించేందుకు సిద్ధంగా ఉం దన్నారు. అప్పగింతల ప్రక్రియ పూర్తయి న వెంటనే పవర్ ప్రాజెక్టులపై హక్కులను కోల్పోతామని, తద్వారా విద్యుత్ ఉత్పత్తి లోటుతో మళ్లీ కరెంట్ కష్టాలు తప్పవన్నారు. ప్రాజెక్టుల అప్పగింతపై బీఆర్ఎస్ నిలదీయడంతోనే కాంగ్రెస్ యూటర్న్ తీసుకుందన్నారు. కేఆర్ఎంబీ అప్పగింతతో నర్సంపేట ప్రాంతంలో పాకాల, రంగయ్య చెరువు ప్రాజెక్టులపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్య క్తం చేశారు.
నర్సంపేట ప్రాంతం కేఆర్ఎంబీ పరిధిలోనిదేనని వివరించారు. కేఆర్ఎంబీ అప్పగింతపై బీఆర్ఎస్ నల్లగొండలో ఈ నెల 13న నిర్వహించనున్న సభకు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు, రైతులు తరలిరావాలని పెద్ది పిలుపునిచ్చారు. కేసీఆర్ సర్కారు హయాంలో నిర్మించిన సక్సెస్ ప్రాజెక్టు, ప్రభుత్వ పథకాలపై దుష్ప్రచారం చేయడమే కాంగ్రెస్ ఎజెండాగా పెట్టుకుందని విమర్శించారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు, మిషన్ భగీరథపై మంత్రులకు సరైన పట్టులేదని విమర్శించారు. గాలితో గెలిసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి సరైన గ్రౌం డింగ్ లేదని ఎద్దేవా చేశారు. సమావేశంలో ఎంపీపీ జాటోత్ రమేశ్, నెక్కొండ సొసైటీ చైర్మన్ మారం రాము, జడ్పీటీసీ లావుడ్యా సరోజా హరికిషన్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సంగని సూరయ్య, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొమ్ము రమేశ్‌యాదవ్, షేక్ అబ్దుల్నబీ, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి తాటిపెల్లి శివకుమార్, గుంటుక సోమయ్య, సూరం రాజిరెడ్డి, సారంగం, ఈదునూరి యాకయ్య, వీరభద్రయ్య పాల్గొన్నారు.
నెక్కొండ/నర్సంపేటరూరల్ : నెక్కొండ రామాలయ కమిటీ మాజీ చైర్మన్ పొడిశెట్టి సత్యం తల్లి వెంకటనర్సమ్మకు పెద్ది నివాళులర్పించారు. అనంతరం ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు. అలాగే, హరిశ్చంద్తండాకు చెందిన సొసైటీ డైరెక్టర్ తేజావత్ గోపీనాయక్ తండ్రి అమృ మృతి చెందగా, బాధితును పరామర్శించి సంతాపం తెలిపారు. ఆయన వెంట కొమ్మారెడ్డి రవీందర్‌రెడ్డి, సూరం రాజిరెడ్డి, ఈదునూరి యాకయ్య ఉన్నారు. అలాగే, నర్సంపేట మండలం దాసరిపల్లికి చెందిన దాసరి సుదర్శన్‌రెడ్డి, కమలాపురానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త రఫీ కుటుంబాన్ని పెద్ది పరామర్శించారు.