కరీమాబాద్ మే 14 : ఖమ్మం నుంచి వరంగల్ వైపుగా వెళ్తున్న ఓ ఆయిల్ ట్యాంకర్ మంగళవారం అర్ధరాత్రి సమయంలో ప్రమాదవశాత్తు వరంగల్ సమీపంలో విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. ఈ ఘటనలో విద్యుత్ స్తంభం పూర్తిగా విరిగి ఆయిల్ ట్యాంకర్ పై పడింది అదృష్టవశాత్తు ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. ఆయిల్ ట్యాంకర్ వాహనం ముందు టైరు పగలడంతోనే ప్రమాదం జరిగినట్లుగా స్థానికులు చెప్తున్నారు.ఈ సంఘటనతో విద్యుత్ సరఫరాను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Heroine | ఆ హీరోయిన్ దగ్గర జాబ్ చేసే ఛాన్స్.. క్వాలిఫికేషన్స్ ఇవే..!
Donald Trump | సీజ్‌ఫైర్‌కు ఎలా ఒప్పించానంటే?.. భారత్ పాక్ కాల్పుల విరమణపై ట్రంప్