HomeWarangal-ruralOfficials Have Prepared Everything For Tet Teacher Eligibility Test
నేడు టెట్
నేడు నిర్వహించనున్న టెట్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పేపర్-1 పరీక్ష ఉదయం 9.30 నుంచి 12 వరకు, పేపర్-2 మధ్యాహ్నం 2.30 సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు.
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 124 కేంద్రాలు
మొదటి పేపర్‌కు 24,139, రెండో పేపర్‌కు 21,118 మంది హాజరుకానున్న అభ్యర్థులు
ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్.. సీసీ కెమెరాలు
ఆయా జిల్లాల్లో ప్రత్యేక హెల్ప్ డెస్క్ నంబర్లు ఏర్పాటు
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా శుక్రవారం నిర్వహించనున్న టెట్(టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) కోసం అధికారులు సర్వం సిద్ధం చేశారు. జనగామ జిల్లాకు సంబంధించి స్టేషన్‌ఘన్‌పూర్ డివిజన్ కేంద్రంలో, మహబూబాబాద్, తొర్రూరు, భూపాలపల్లి, ములుగు, హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో 124 కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొదటి పేపర్‌కు 24,139, రెండో పేపర్‌కు 21,118 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయనున్నారు. ఆయా జిల్లాల్లో ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఫోన్ నంబర్లను అందుబాటులో ఉంచారు.
– హనుమకొండ, సెప్టెంబర్ 14
నేడు నిర్వహించనున్న టెట్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పేపర్-1 పరీక్ష ఉదయం 9.30 నుంచి 12 వరకు, పేపర్-2 మధ్యాహ్నం 2.30 సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు. జనగామ జిల్లా లో 10 కేంద్రాల్లో 4343, మహబూబాబాద్‌లో 32 సెంటర్లలో 7087, ములుగులో 14 కేంద్రాల్లో 3187, వరంగల్‌లో 20 కేంద్రాల్లో 9047, హనుమకొండలో 42 కేంద్రాల్లో 18994, భూపాలపల్లి జిల్లాలో 6 కేం ద్రాల్లో 2599 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు.
పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్..
టెట్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించనున్నారు. పరీక్షకు గంట ముందుగానే అభ్యర్థులు కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది. తమ హాల్ టికెట్, బ్లాక్/బాల్ పాయింట్ పెన్నులు, ఏదైనా గుర్తింపు కార్డుతో మాత్రమే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. సెల్ఫోన్లతో పాటు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు వేటిని కూడా పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించరు. హాల్ టికెట్లో ఫొటో కానీ, సంతకం కానీ ప్రింట్ లేకపోతే ఫొటో అతికించి గెజిటెడ్ అధికారి ధ్రువీకరణతో పాటు జిల్లా విద్యాశాఖాధికారి సంతకాన్ని పెట్టించుకొని పరీక్షకు హాజరుకావాలి.
ప్రత్యేక హెల్ప్ డెస్క్ నంబర్లు ఇవే..
పరీక్షలు రాసే అభ్యర్థులు ఏవైనా సందేహాలను నివృత్తి చేసుకోవాలనుకునేందుకు ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఫోన్ నంబర్లను ఏర్పాటు చేశారు. జనగామ జిల్లాకు సంబంధించి 6304062768, మహబూబాబాద్‌లో 9490556656, వరంగల్‌లో 9948625186, హనుమకొండలో 6281985031 ఫోన్ నంబర్ల ను అందుబాటులో ఉంచారు.