అంగన్వాడీ సిబ్బంది నిర్లక్ష్యంగా ఉండొద్దు
అంగన్వాడీ సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్‌గౌడ్ హెచ్చరించారు.
- విధిగా సమయపాలన పాటించాలి
- లబ్ధిదారులకు పౌష్టికాహారం అందించాలి
- ఎంపీపీ అనిమిరెడ్డి, జడ్పీటీసీ కుమార్
రాయపర్తి, డిసెంబర్ 15: అంగన్వాడీ సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్‌గౌడ్ హెచ్చరించారు. రాగన్నగూడెంలోని అంగన్వాడీ కేంద్రాన్ని గురువారం వారు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారం, వసతులను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్లు, ఆయాలు విధిగా సమయపాలన పాటించాలని, ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారాన్ని లబ్ధిదారులకు అందించాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ గోవర్ధన్‌రెడ్డి, ఎంపీటీసీ వీరస్మా, నాయకులు మధు, ఐత రాంచందర్, ప్రభాకర్, నవల, రాజ్‌రెడ్డి, చందు, రామ్, కిషన్ పాల్గొన్నారు.
పౌష్టికాహారాన్ని వినియోగించుకోవాలి
ఖానాపురం: అంగన్వాడీ కేంద్రాలను వినియోగించుకోవాలని కొత్తూరు సర్పంచ్ బూస రమా అశోక్ అన్నారు. గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు కోడిగుడ్లు, బాలామృతాన్ని సర్పంచ్ పంపిణీ చేశారు. లబ్ధిదారులు అంగన్వాడీ సెంటర్లలో అందించే పోషకాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ అధికారులు, అంగన్వాడీ సిబ్బంది ఉన్నారు.
అంగన్వాడీ కేంద్రం ప్రారంభం
నర్సంపేటరూరల్: అంగన్వాడీ కేంద్రం సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని లక్నేపల్లి సర్పంచ్ గొడిశాల రాంబాబుగౌడ్ అన్నారు. గ్రామంలో ఏర్పాటు చేసిన మినీ అంగన్వాడీ సెంటర్‌ను సర్పంచ్ ప్రారంభించి మాట్లాడారు. గ్రామంలో ఒకే అంగన్వాడీ కేంద్రం ఉండడంతో పిల్లలకు ఇబ్బందులు ఉండేవన్నారు. మినీ అంగన్వాడీ సెంటర్ ఏర్పాటుతో ఇబ్బందులు తొలగిపోనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సూపర్వైజర్ పారిజాతం, కార్యదర్శి కూతురు అనితారెడ్డి, అంగన్వాడీ టీచర్లు విజయ, కవిత, ప్రవళిక, వార్డు సభ్యులు మిడిమాలపు కృష్ణకుమారి, గ్రామ పెద్దలు గొడిశాల అశోక్, పిండి శ్రీను, కొడారి రజాక్, ఆయా కల్పన, కారోబార్ ఉల్లేరావు రజిత పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

