వరంగల్, జనవరి 30 : కలెక్టర్, ఉన్నతాధికారులు మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నామినేషన్ల జోష్ కనిపించింది. శుక్రవారం చివరి రోజు కావడంతో అన్ని పార్టీల నుంచి పెద్ద ఎత్తున అభ్యర్థులు దాఖలు చేశారు. దీంతో మున్సిపాలిటీల్లో ఎక్కడ చూసినా రాజకీయ సందడి నెలకొంది. వాడవాడనా పార్టీ కండు వాలతో కార్యకర్తల హంగామా కనిపించింది. నామినేషన్ల ప్రక్రియ రాత్రి వరకూ కొనసాగింది.
ఉమ్మడి జిల్లాలోని 12 మున్సిపాలిటీల్లో నామినేషన్లు వేసేందుకు నాయకులు ర్యాలీలతో తరలివచ్చారు. అభ్యర్థులు తమ సత్తా చాటుకునేలా భారీగా కార్యకర్తలను సమీకరించుకొని ర్యాలీగా రావడంతో నామినేషన్ కేంద్రాలు కోలాహలంగా మారాయి. కలెక్టర్లు, అదనపు కలెక్ట ర్లు, ఉన్నతాధి కారులు సెంటర్లను సందర్శించి ప్రక్రియను పరిశీలించారు.
పలు మున్సిపాలిటీల్లో రాత్రి వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది. సాయంత్రం 5 గంట ల వరకు సమయం ముగిసినా అప్పటికే కేంద్రాలకు వచ్చిన అభ్యర్థులు పెద్ద సంఖ్యలో వేచి ఉ న్నారు. దీంతో పలు మున్సిపాలిటీలో రాత్రి 8గంటల వరకు అధికారులు నామినేషన్లను స్వీకరిం చారు. ఉమ్మడిజిల్లాలోని 12 మున్సిపాలిటీలలో నామినేషన్ల చివరి రోజు పోటాపోటీగా నామి నేషన్లు వేశారు. వివిధ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు పెద్ద ఎత్తున దాఖలు చేశారు. మహబూబాబాద్ మున్సిపాలిటిలో 249, జనగామ 197, భూపాలపల్లి …., నర్సంపేట 191, పరకాల 171, ములుగు …., స్టేషన్ ఘన్పూర్ 121, తొర్రూరు 93, కేసముద్రం 109, డోర్నకల్ 96, మరిపెడ 108, వర్ధన్నపేట 84 నామినేషన్లు దాఖలయ్యాయి. అత్యధికంగా మహబూబాబాద్ మున్సిపాలిటీలో నామినేషన్లు వేశారు.
తొర్రూరు. జనవరి 30 : తొర్రూరులోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మున్సిపల్ అభ్యర్థులను ఇన్చార్జి మర్రి యాదవరెడ్డి శు క్రవారం ఖరారు చేశారు. 1 వార్డుకు భూసా ని జయమ్మ- ఉప్పలయ్య, 4 వార్డు జంప న్న, 5 వార్డు మచ్చ సురేశ్, 7 వార్డు మాడుగుల భవానీలత-నట్వర్, 8 వార్డు అల్లం శ్యామల-శ్యామ్, 9వార్డు కిన్నెర కవిత- సతీ శ్, 11 వార్డు కర్న నాగరాజు, 12 వార్డు ధ రావత్ పద్మ- కిషన్‌నాయక్, 13 వార్డు ఎన్నమనేని శ్రీదేవి- శ్రీనివాస్‌రావు, 14 వార్డు పడిపెద్ది స్రవంతి-మల్ల్లేశ్, 15 వార్డు చాకిలేల అలివేలి- నాగరాజు, 16 వార్డు ధరవాత్ జైసింగ్ నాయక్‌ను ప్రకటించారు. బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు.