మరిపెడ : జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లు సరఫరాపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు మరిపెడ మండలం భూక్య తండాకు చెందిన ఒక వ్యక్తిని అధీనంలోకి తీసుకొని విచారిస్తున్న సంఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో బుధవారం చోటు చేసుకుంది. గత ఎడాది ఫిబ్రవరిలో భద్రాచలంలో సమీపంలో ఒడిషాకు చెందిన వ్యక్తిని ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకొని అతని నుంచి పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. విచారణ కొనసాగింపులో భాగంగానే మరిపెడ మండలంలో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించినట్లు విశ్వనీయత సమాచారం.
విచారణ కొనసాగింపులో భాగంగానే బుధవారం భూక్య తండాలో 5 గురు ఎన్ఎస్ఐఏ అధికారులు స్థానిక పోలీసులతో కలసి మరిపెడ మండలంలోని భూక్య తండాకు చెందిన ఒక వ్యక్తి ఇంట్లో ఉదయం 5 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు సోదాలు నిర్వహించారు. సూమారు 5గంటలు నిర్వహించి సోదాల సమయంలో బయటి వ్యక్తులను ఎవరిని కూడా ఇంట్లోకి రానివ్వలేదు. అనంతరం అనూమనితున్ని స్థానిక పోలీసు స్టేషన్ కు తరలించి ఎన్ఐఏ అధికారులు విచారిస్తున్నారు.
ఒడిషాకు చెందిన ఒక వ్యక్తి గత 4సంవత్సరల నుంచి మిర్చి తోటలు ఎరువులు, నాట్లు వేసేందుకు ఒరిస్సా రాష్ట్రం నుంచి కూలీలను తీసుకవస్తూ ఉండేవాడు. ఇదే క్రమంలో భూక్య తండాకు చెందిన వ్యక్తితో స్నేహం ఏర్పడడంతో ఇద్దరు కలసి ఆకేరు వాగులో చేపలు పట్టడం కోసం పేలుడు పదార్ధలను ఉపయోగించి వాగులో చేపలు పట్టి తినేవారని, ఒడిషాకు చెందిన వ్యక్తి తమ ప్రాంతంలో చేపలు పడడం కోసం జిలిటిన్ స్టిక్స్, డిటోనేటర్లును ఇక్కడి నుంచి కొనుగొలు చేసి వాటిని సంఘ విద్రోహులకు ఎక్కవ ధరలకు విక్రయిస్తున్నట్లు సమాచారం.
ఉలిక్కిపడిన తండా వాసులు..
జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సోదాలతో భూక్య తండా వాసులు ఉలిక్కిపడ్డారు. జిల్లాలో తొలి సారిగా ఎన్ఐఏ అధికారులు సంఘ విద్రోహులకు సానూభూతిపరుగా భావిస్తున్న తండాకు చెందిన వ్యక్తి ఇంట్లో తనీఖీలు నిర్వహించారు. తండాకు స్థానిక పోలీసులతో పాటు ఇతర వాహనాల్లో అధికారులు వచ్చి హడావుడి చేయడంతో ఏమి జరుగుతుందో తెలియక తండా వాసులు అయోమయం చెందారు. తొలుత తండాలో కార్డన్ సెర్చ్ ను పోలీసులు నిర్వహిస్తున్నట్లు భావించిన తండా వాసులు, అసలు విషయం తెలవడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.