న్యూఢిల్లీ: ప్రఖ్యాత సోషల్మీడియా వేదిక ‘ఎక్స్’ సేవల్లో సోమవారం తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ‘ఎక్స్’ సేవలు ప్రభావితమయ్యాయి.
ఈ ఆకస్మిక అంతరాయంపై కంపెనీ ఎలాంటి వివరణా ఇవ్వకపోవటం లక్షలాది మంది యూజర్లను తీవ్రంగా నిరాశపర్చింది.