అయిజ, ఫిబ్రవరి 16 : అయిజ మున్సిపాలిటీపై గులాబీ జెం డా ఎగిరింది. అయిజ మున్సిపల్ చైర్మన్‌గా సీఎం సురేశ్, వైస్ చైర్మన్‌గా మాల నర్సింహులును బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఎన్నుకున్నారు. అయిజ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన ప్రమాణస్వీకారోత్సవం, చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపికలను మున్సిపల్ ఎన్నికల ప్రత్యేకాధికారి నాగేంద్ర ఆధ్వర్యంలో చేపట్టారు. మున్సిపల్ ఎన్నికల్లో 13 మంది బీఆర్ఎస్, ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్లను పట్టణ ప్రజలు ఎన్నుకున్నారు.
చైర్మన్, వైస్ చైర్మన్ స్థానాలకు బీఆర్ఎస్, కాంగ్రెస్‌లు పోటీపడ్డాయి. దీంతో ఎన్నికల అధికారి చే తులెత్తే పద్ధతి ద్వారా చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకోవాలని కౌన్సిలర్లకు సూచించారు. చైర్మన్‌గా 13వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ సీఎం సురేశ్‌ను ఒకటో వార్డు కౌన్సిలర్లు తిరుమలేశ్ ప్రతిపాదించగా, 8వ వార్డు కౌన్సిలర్లు మాల నర్సింహులు బ లపర్చారు. వైస్ చైర్మన్‌గా 8వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ మా ల నర్సింహులును బీఆర్ఎస్కు చెందిన 14వ వార్డు కౌన్సిల ర్ కృష్ణయ్య ప్రతిపాదించగా, 9వ వార్డుకు చెందిన ఎరుకలి శివ బలర్చారు.
చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికకు బీఆర్ఎస్కు చెందిన 13 మంది సంఖ్యాబలం ఉండటంతో ఎన్నికల అధికారి నాగేంద్ర చైర్మన్‌గా సీఎం సురేశ్, వైస్‌చైర్మన్‌గా మాల న ర్సింహులు ఎన్నికైనట్లు ప్రకటించారు. అనంతరం అయిజ మున్సిపల్ చైర్మన్‌గా సీ ఎం సురేశ్, వైస్ చైర్మన్‌గా నర్సింహులు తో ఎన్నికల అధికారి ప్ర మాణస్వీకా రం చేయించారు. అనంతరం ఎన్నికల అధికారి నాగేంద్ర, కమిషనర్ సైదులు పుష్పగుచ్ఛం అందజేసి సత్కరించారు.
20మంది కౌన్సిలర్ల ప్రమాణస్వీకారం
అయిజ మున్సిపాలిటీకి ఎన్నికైన 20మంది కౌన్సిలర్లతో ఉదయం 11గంటలకు అయిజ ఎన్నికల ప్రత్యేకాధికారి నా గేంద్ర ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం సభను గం టపాటు వాయిదా వేసి, మధ్యాహ్నం 12 గంటలకు చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక చేపట్టారు. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక పూర్తికాగానే కార్యాలయం సమీపంలో ఉన్న బీఆర్ఎస్ శ్రేణులు, పట్టణ ప్రముఖులు, కార్యకర్తలు హర్షాతీరేకాలు వ్యక్తం చేశా రు. ముచ్చటగా మూడోసారి అయిజ బల్దియాపై గులాబీ జెం డా రెపరెపలాడటంతో బీఆర్ఎస్ శ్రేణులు ఉత్సాహంతో పొంగిపోయారు. పటాకులుకాల్చి సంబురాలు చేసుకొన్నారు.