హనుమకొండ, నవంబర్ 14 : సమాన పనికి సమాన వేతనం ఇవ్వాల్సిందేనని నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం) ఉద్యోగులు హనుమకొండ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. నల్లబ్యాడ్జీలు ధరించి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు నెలలుగా జీతాలందక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు న్నప్పటికీ సమాన పనికి సమాన వేతనం అమలు చే యకపోవడం అన్యాయమని మండిపడ్డారు. తమ సమస్యలు పరిషరించే వరకు నిరసనలను మరింత తీవ్రం చేస్తామని హెచ్చరించారు.
ప్రతి నెల 1వ తేదీన వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని, కాంట్రా క్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల కోసం ప్రత్యేక కార్పొరేషన్, మహిళా ఉద్యోగులకు180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు మంజూ రు చేయాలని డిమాండ్ చేసారు. ఈ ధర్నాలో ఎన్హెచ్ఎం జిల్లా నాయకులు ఎండీ రుక్ముద్దీ న్, అరుణ్ కుమార్, మహేందర్, సురేశ్, నవీన్ కుమార్, వినోద్ కుమార్, నాయకులు రాజేంద్రప్రసాద్, అనిత, విజేత, సుష్మ, అనూ ష, కనిష, ప్రవీణ్, సుదర్శ న్, వినోద్, నరేశ్, రాకేశ్, రహమాన్, సందీప్ కుమార్తో పాటు డీపీఎంయూ, డీపీఎంవోస్, డీటీసీ వో, జీఎంహెచ్, మిడ్ వైఫ్స్, ఎస్ఎన్సీ యూ, సీఎల్ఎంసీ, టీ-హబ్, ఏఎన్ఎంలు, నర్సింగ్, ఫార్మసీ ఆఫీసర్స్, ల్యాబ్ టెక్నీషియన్స్, అకౌం టెంట్స్, సీవోలు, అటెండర్లు పాల్గొన్నారు.