ఖిలావరంగల్, మే 2: మామునూరులోని జవహర్ నవోదయ కేంద్రంలో ఈ నెల 4న నిర్వహించనున్న నీట్ నిర్వహణకు పటిష్ట ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ సత్యశారద తెలిపారు. ఈ పరీక్ష కేంద్రంలో 240 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నట్లు తెలిపారు. పరీక్ష కేంద్రంలోకి ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు అనుమతి ఉంటుందన్నారు.
మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సీసీ కెమెరాలు, పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులు సెంటర్లోకి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకెళ్లొద్దని తెలిపారు. అడ్మిట్ కార్డుతోపాటు లేటెస్ట్ పాస్ఫొటో సైజ్ రెండు ఫొటోలు, ఐడీ ఫ్రూప్ను వెంట తీసుకెళ్లాలని సూచించారు.