హనుమకొండ, నవంబర్ 11: తెలంగాణ మైనార్టీ గురుకుల పాఠశాల, కళాశాల(వరంగల్ బాలికలు-1)లొ జాతీయ విద్యా దినోత్సవం, మైనార్టీ డే ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేయూ ప్రొఫెసర్ ముస్తఫా పాల్గొని మాట్లాడారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
ముఖ్యంగా ఖవ్వాలి అందరినీ ఆకర్షించింది. ఖురాన్ పూర్తిచేసిన విద్యార్థులకు సన్మానం చేశారు. పూర్వవిద్యార్థులు అతియా తరన్నుమ్, హదస్సా, వర్ష లాంటి ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రిన్సిపాల్ దాసరి క్రిష్ణకుమారి చేతులమీదుగా సన్మానించారు. కార్యక్రమంలో అధ్యాపకులు, ఉద్యోగులు, సిబ్బంది, విద్యార్థినులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.